నిఘంటు శోధన 

శ్రీహరి నిఘంటువు
(సూర్యరాయాంధ్ర నిఘంటుశేషం)


సంపాదకుడు
ఆచార్య రవ్వా శ్రీహరి


నా మాట

భాషాభిమానులైన పిఠాపురం రాజాగారి అండదండలతో, జయంతి రామయ్యపంతులు గారి ఆధ్వర్యంలో అనేక పండితుల కృషి ఫలితంగా 'శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు' అనే పేర ఒక బృహన్నిఘంటువు నిర్మాణం జరిగింది. ప్రముఖ భాషా సాహితీ సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్తు దీన్ని ప్రచురించింది. ప్రామాణికమైన తెలుగు నిఘంటువుల్లో దీనికి ప్రముఖ స్థానం ఉంది. నిఘంటు నిర్మాణకాలంనాటికి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని, వివిధ నిఘంటువులను ఆధారంగా చేసుకొని ఈ నిఘంటు నిర్మాణం జరిగింది.

ఈ నిఘంటు నిర్మాణం 1911లో ప్రారంభింపబడి 1972లో పూర్తిగావింపబడింది. మొత్తం ఏడు సంపుటాల్లో ప్రచురింపబడిన దీని ముద్రణ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏ నిఘంటువైనా సర్వసమగ్రమని చెప్పలేం. తరువాతికాలంలో లభించిన సామగ్రినిబట్టి, భాషలో వచ్చిన మార్పులనుబట్టి నిఘంటువులో ఎన్నో మార్పులకు, చేర్పులకు అవకాశం ఉంటుంది. అమరకోశం మొదలైన ఎన్నో ప్రాచీన నిఘంటువులకు కూడా అనంతరకాలంలో శేషగ్రంథాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సుమారు అరవై సంవత్సరాలకు పూర్వం సిద్ధం చేయబడిన సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా భాషలో తరువాత వచ్చిన మార్పుల ఆధారంగా అందులో లేని ఆరోపాలను చేరుస్తూ దీనికి ఒక అనుబంధ నిఘంటువును సిద్ధం చేయవలసిన ఆవశ్యకం ఎంతో ఉంది. దీన్ని గుర్తించి ఈ నిఘంటుకర్త గత ఏడెనిమిది సంవత్సరాలుగా కృషిచేసి వివిధ ఆకరాలను పరిశీలించి ఇందులో లేని ఆరోపాలనెన్నింటినో సేకరించి సూర్యరాయాంధ్ర నిఘంటువుకు శేషగ్రంథంగా ఈ 'శ్రీహరి నిఘంటువు'ను సిద్ధం చేయడం జరిగింది.

ఈ "శ్రీహరి నిఘంటువు"ను గురించిన కొన్ని వివరాలు :

  1. సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని సుమారు ముప్పైఐదువేల కొత్త ఆరోపాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

  2. సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించని తాళ్లపాక కవుల సాహిత్యం - ప్రధానంగా అన్నమయ్య కీర్తనలు; క్షేత్రయ్యపదాలు, సారంగపాణి పదాలు మొదలైన పదసాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; కాటమరాజుకథలు, బొబ్బిలియుద్ధం మొదలైన జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు; రాయవాచకం, సిద్ధేశ్వరచరిత్ర మొదలైన చారిత్రక గ్రంథాలు, కట్టా వరదరాజు శ్రీరామాయణం, పల్నాటి వీరచరిత్ర మొదలైన ద్విపద గ్రంథాలు; యక్షగాన-సాహిత్యం; కాశీయాత్రా చరిత్ర, సాక్షి మొదలైన వచన గ్రంథాలు - వీటన్నిటినీ సంప్రతించి ఎన్నో ఆరోపాలు సేకరించి ఇందులో పొందుపరచడం జరిగింది.

  3. సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రదించని తూము రామదాసకవి ఆంధ్రపద నిధానము (1930), సర్వాంధ్రసార సంగ్రహము, మారేపల్లివారి నుడికడలి (అముద్రితం) మొదలైన నిఘంటువుల నుండి ఎన్నో దేశ్యపదాలను సేకరించి ఇందులో చేర్చడం జరిగింది. ఆంధ్రపద నిధానంలో దాదాపు 250 దేశ్యపదాలు లభ్యమైనాయి.

  4. సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు సంప్రతించిన ఆంధ్రమహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, హంసవింశతి, శుకసప్తతి మొదలైన గ్రంథాలలో కూడా వారి దృష్టికి రాక తప్పిపోయిన ఆరోపాలను కూడా ఎన్నింటినో గుర్తించి ఈ నిఘంటువులో చేర్చడం జరిగింది.

  5. కేవలం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలనుండేకాక ఆధునిక సాహిత్యం (నవలలు, కథలు, కవిత్వం మొదలైనవి) నుండి కూడా సేకరింపబడిన ఎన్నో వాడుకపదాలు ఇందులో ఆరోపాలుగా గ్రహింపబడ్డాయి.

  6. పూర్వ నిఘంటువుల్లో మాండలికపదాలకు, నిత్యవ్యవహారంలో ఉన్న అనేక పదాలకు స్థానం కనిపించదు. సాహిత్యమంతటా ఒకేచోట, ఒక్కసారి మాత్రమే ప్రయోగింపబడ్డ పదానికి కూడా నిఘంటువుల్లో స్థానం ఇస్తున్నప్పుడు లక్షలాది జనం నాలుకలపై ఉండి నిఘంటువుల్లోకి ఎక్కకపోవడం అపచారమే అనిపిస్తుంది. కనుక మాండలిపదాలు, జనుల నిత్యవ్యవహారంలోని పదాలు ఎన్నో ఇందులో సంగ్రహింపబడ్డాయి.

  7. కేవలం పదాలేకాక భాషా వ్యవహారంలోని ప్రత్యేకతను తెలిపే పదబంధాలు కూడా ఇందులో ఆరోపాలుగా చూపబడ్డాయి. ఐతే ఆ పదాలన్నీ ప్రధానపదంలోనే భిన్న భిన్న ఆరోపాలుగా కాక స్వతంత్రారోపాలుగా గ్రహింపబడ్డాయి.

  8. ఆరోపాలకు కేవలం అర్థాలేకాక వాటికి వీలైనంతవరకు సాహిత్యం నుండి, వ్యవహారం నుండి ప్రయోగాలు చూపబడ్డాయి.

  9. సూర్యరాయాంధ్ర నిఘంటువులో చేరక ఇతర నిఘంటువుల్లో - ముఖ్యంగా వావిళ్ల నిఘంటువు, వాచస్పత్యం, బ్రౌణ్యం, తెలుగు వ్యుత్పత్తి పదకోశం మొదలైన నిఘంటువుల్లో లభించే పదాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇందువల్ల ప్రస్తుత సూర్యరాయాంధ్ర నిఘంటువులో లభ్యంకాని పదాల కోసం ఇతర నిఘంటువులను సంప్రతించవలసిన అవసరం ఉండదు. చాలావరకు ఈ నిఘంటువు ఆ అవసరాన్ని తీరుస్తుంది.

  10. సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణం జరిగిన తరువాత ఈ యాభై అరవై యేళ్ళలో భాషలో ఎంతో కొత్త పదజాలం ఏర్పడింది. ఉన్న పదజాలానికి కూడా అర్థపరిణామాదులు కలిగినాయి. ఈ నిఘంటు నిర్మాణంలో వీటిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది.

  11. అర్థనిర్ణయం సందిగ్ధంగా ఉన్న కొన్ని పదాలకు ఎదురుగా (?) గుర్తువేసి వదిలివేయడం జరిగింది. విజ్ఞులు వాటి అర్థాలు తెలియజేస్తే తరువాతి ముద్రణలో చేర్చుకుంటాను.

  12. ఒక మూలశబ్దం నుండి ఏర్పడ్డ వివిధ పదాలను సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆ పదం ఆరోపం క్రింద చూపడంతో పాటు కొన్ని సందర్భాల్లో విడివిడిగా చూపడం కూడా జరిగింది. ఈ నిఘంటువులో అలా కాకుండా ప్రతి ఆరోపం స్వతంత్రారోపంగానే చూపబడింది.

  13. సూర్యరాయాంధ్ర నిఘంటువులో గ్రాంధికభాషే అనుసరింపబడడంవల్ల దాని శేష గ్రంథమైన ఈ నిఘంటువులోనూ గ్రాంథికభాషే స్వీకరింపబడింది.

అన్నమయ్య కీర్తనల్లోనూ, బసవపురాణాది గ్రంథాల్లోనూ అర్థనిర్ణయం కాని దేశ్యపదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆయాపదాలకు అర్థనిర్ణయం చేయగల సత్తా ఉన్న పండితుల సంఖ్య క్రమంగా మృగ్యమైపోతుంది. ఉన్నవారిలో సమర్థులైన పండితుల సాహాయ్యంతో ఈ పదాలకు అర్థనిర్ణయం చేయించి నిఘంటువుల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో పాలుపంచుకున్నవారు దిగ్దంతులైన పండితులు. వారి పాండితీశక్తి నాకు లేదు. కేవలం భాషాభిమానంతో మాత్రమే ఈ ప్రయత్నం చేసినాను. ఈ నా ప్రయత్నాన్ని భాషాభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ నిఘంటు నిర్మాణంలో తెలుగు, సంస్కృత నిఘంటువులెన్నో తోడ్పడ్డాయి. వాటి రచయితలకు, సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ నిఘంటువును శ్రద్ధతో డి.టి.పి. చేసిన మిత్రులు బాలాజీగ్రాఫిక్స్ అధినేత శ్రీ డి. వెంకటేశ్వరరావు గారికి, వారి శ్రీమతి డి. మాధవీలత గారికి నా శుభాకాంక్షలు.

ఈ నిఘంటునిర్మాణ వివిధదశల్లో నాకు సహకరించిన శ్రీ మాధవనాయుడుకు (P.A. to Vica Chancellor, Dravidian University) నా ఆశీస్సులు.

ఈ నిఘంటు ప్రచురణకు తగిన రీతిలో ఆర్థిక సాహాయ్యం చేసిన కేంద్ర భారతీయ భాషా సంస్థ (Central Institute of Indian Languages) వారికి - ముఖ్యంగా దీని నిర్దేశకులు, భాషాశాస్త్రవేత్తలు, ఆచార్య ఉదయనారాయణ్‌సింగ్ గారికి నా హార్దిక కృతజ్ఞతలు.

ఈ గ్రంథాన్ని సకాలంలో చక్కగా ముద్రించి ఇచ్చిన శ్రీ కళాంజలి గ్రాఫిక్స్ అధినేత శ్రీ గోపీనాథరెడ్డి గారికి కృతజ్ఞతలు.

ఈ గ్రంథం నా షష్టిపూర్తి సంవత్సరంలో రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది.

- రవ్వా శ్రీహరి
తారణ శుద్ధపాడ్యమి
21-3-2004


సంకేతవివరణం

అ.క్రి.అకర్మకక్రియ
అ.దే.అన్యదేశ్యము
అను.ఆనుశాసనికపర్వము
అప్పప్పఅప్పప్పకవి
అర.అరణ్యపర్వము, అరణ్యకాండము
అలం.అలంకారశాస్త్రము
అవ్య.అవ్యయము
అశ్వ.అశ్వమేధపర్వము
ఆ.ఆశ్వాసము
ఆం.ఆంగ్లము
ఆది.ఆదిపర్వము
ఆను.ఆనుశాసనికపర్వము
ఆశ్ర.ఆశ్రమవాసపర్వము
ఉ. /ఉద్యో.ఉద్యోగపర్వము
ఉ.గో.ఉభయగోదావరి జిల్లాలు
క.కర్ణపర్వము
కరీ.కరీంనగర్‌ జిల్లా
కర్ణ.కర్ణపర్వము
కర్నూ.కర్నూల్‌ జిల్లా
కాం.కాండము
కి.కిష్కింధాకాండము
కృ.కృష్ణాజిల్లా
క్రి.విణ.క్రియావిశేషణము
గం.గంజాము జిల్లా
గు./గుం./గుంటూ.గుంటూరు జిల్లా
గో.గోదావరి జిల్లా
గౌ./గౌర.గౌరనకవి
చి.చిత్తూరు జిల్లా
చి.సూ.చిన్నయసూరి
ఛం.ఛందస్సు
జాన.జానపదసాహిత్యము
తి.తిర్యగ్వర్గు
తిరు.వేం.తిరుపతివేంకటకవులు
తె.తెలంగాణము
దీక్షా.దీక్షాప్రకరణము
దే./దేవ.దేవవర్గు
ద్రో.ద్రోణపర్వము
ద్వి.ద్విపద
నల్ల.నల్లగొండ
నా.నారాయణకవి
నె.నెల్లూరు జిల్లా
ప.పద్యము
పర్వ.పర్వతప్రకరణము
పీ.పీఠిక
పు.పుట
పురా.పురాతన ప్రకరణము
పూ.పూర్వభాగము
పొ.పొరట
ప్రథ.ప్రథమ ప్రకరణము
ప్రాయ.ప్రాయశ్చిత్తకాండము
బహు.బహువచనము
బా.బాలకాండము
భీ.భీష్మపర్వము
మ.మహబూబ్‌నగర్‌ జిల్లా
మడి.మడికిసింగన
మరా.మరాఠీ
మహి.మహిమప్రకరణము
మాం.మాండలికము
మాన.మానవవర్గు
మౌ.మౌసలపర్వము
యక్ష.యక్షగానము
యు.యుద్ధకాండము
రం.రంగాజమ్మ
రా.రాయలసీమ
రూపాం.రూపాంతరము
వ.వరంగల్లు జిల్లా
వాద.వాద ప్రకరణము
వి.విశేష్యము
వి.విరాటపర్వము
వి.విశాఖపట్టణం జిల్లా
విణ.విశేషణము
విరా.విరాటపర్వము
వీ.వీరేశలింగం
వేం.వేంకటనాథకవి
వేంగ.వేంగమాంబ
వేదాం.వేదాంతము
వ్యవ.వ్యవహారము
వ్యా.వ్యాకరణము
వ్యు.వ్యుత్పత్తి
శ.శల్యపర్వము
శాం./శాంతి.శాంతిపర్వము
శృం.శృంగారపదములు
శ్రీ.శ్రీకాకుళము
స.సభాపర్వము
స.క్రి.సకర్మకక్రియ
సభా.సభాపర్వము
సర్కా.సర్కారు జిల్లాలు
సుం.సుందరకాండము
సుర.సురవర్గు
స్కం.స్కంధము
స్త్రీ.స్త్రీపర్వము
స్థా.స్థావరవర్గు
సే.సేలం జిల్లా
స్వర్గా.స్వర్గారోహణపర్వము

గ్రంథసంకేతవివరణం

అచలా.అచలాత్మజాపరిణయము
అచ్చ.భా.అచ్చ తెలుగు భారతము
అచ్చ.రా.అచ్చ తెలుగు రామాయణము
అధ్యా.రా.అధ్యాత్మ రామాయణము
అనర్ఘ.అనర్ఘ రాఘవము
అని./అని.చ.అనిరుద్ధచరిత్ర
అను./అను.సా./అనుభవ.అనుభవసారము
అప్ప.అప్పకవీయము
అష్ట.క./అష్టమ.అష్టమహిషీ కల్యాణము
అహ./అహల్యా.అహల్యాసంక్రందనము
అహో.అహోబలపండితీయము
ఆం.కా.ఆంధ్రకామందకము
ఆం.ధా./ఆం.ధా.పా./ఆం.ధాతు.ఆంధ్రధాతుపాఠము
ఆం.నా.శే.ఆంధ్రనామశేషము
ఆంధ్ర.నా.సం./ఆంధ్రనా./ఆంధ్ర.సం.ఆంధ్రనామసంగ్రహము
ఆంధ్ర.పద./ఆం.ని.ఆంధ్రపదనిధానము
ఆం.ప./ఆం.పదా.ఆంధ్రపదార్ణవము
ఆం.భా.ఆంధ్రభాషార్ణవము
ఆం.భూ.ఆంధ్రభాషాభూషణము
ఆం.శే./ఆంధ్ర.శే.ఆంధ్రనామశేషము
ఆనం.ఛ./ఆనంద.ఆనందరంగరాట్ఛందము
ఆము./ఆముక్త.ఆముక్తమాల్యద
ఇందు./ఇందు.ప.ఇందుమతీపరిణయము
ఉ.రా.ఉత్తరరామాయణము
ఉ.హ./ఉ.హరి./ఉత్త.హరి.ఉత్తరహరివంశము
ఉద్భ./ఉద్భటా.ఉద్భటారాధ్యచరిత్ర
ఉషా.ఉషాపరిణయము
ఊర్మిళా.ఊర్మిళాదేవినిద్ర
కకు./కకుత్స్థ.కకుత్స్థవిజయము
కళా.కళాపూర్ణోదయము
కవి./కవి.ర./కవిక.కవికర్ణరసాయనము
కవిచౌ.కవిచౌడప్ప శతకము
కవిసం.కవిసంశయవిచ్ఛేదము
కా.క./కాటమ.కాటమరాజు కథలు
కామధేను.కామధేనుకథ
కా.యా.చ.కాశీయాత్రాచరిత్ర
కా.మా./కాళ.మా.కాళహస్తీశ్వరమాహాత్మ్యము
కాళ.శ.కాళహస్తీశ్వరశతకము
కాళిందీ.కాళిందీపరిణయము
కావ్యా.కావ్యాలంకారసంగ్రహము
కాశీ.కాశీఖండము
కాశీయా.కాశీయాత్రాచరిత్ర
కిరా.కిరాతార్జునీయము
కు.చ./కువ.చ./కువల.చ.కువలయాశ్వచరిత్ర
కుక్కు.కుక్కుటేశ్వరశతకము
కుచే./కుచేలో.కుచేలోపాఖ్యానము
కుమార./కు.సం.కుమారసంభవము
కుశ./కుశ.చ.కుశలవచరిత్ర (జానపదము)
కృష్ణరా.కృష్ణరాయవిజయము
కేయూర.కేయూరబాహుచరిత్ర
క్రీడా.క్రీడాభిరామము
క్షత్ర.క్షత్రబంధూపాఖ్యానము
క్షేత్రయ.క్షేత్రయపదములు
గాధే.గాధేయోపాఖ్యానము
గీర.గీరతము
గౌరీ.గౌరీవిలాసము
చంద్ర./చంద్రభా.చంద్రభానుచరిత్ర
చం.రా./చంపూ.రా.చంపూరామాయణము
చంద్రా./చంద్రాం.చంద్రాంగదాపరిణయము
చంద్రరే./చంద్రరేఖా.చంద్రరేఖాపరిణయము
చంద్రి./చంద్రికా.చంద్రికాపరిణయము
చతు.చతుర్వేదసారము
చారు.చారుచంద్రోదయము
చిత్ర.చిత్రకూటమాహాత్మ్యము (యక్షగానము)
చిత్రభా.చిత్రభానుచరిత్ర
చెన్న./చెన్న.సీ.చెన్నుమల్లుసీసములు
చొ.చ.చొక్కనాథచరిత్ర
జై.భా./జైమి.భా./జైమిని.జైమినిభారతము
తంజా.తంజాపురాన్నదానమహానాటకము (యక్షగానము)
త.నృ.శ.తరిగొండ నృసింహ శతకము
తపతీ.తపతీసంవరణోపాఖ్యానము
తారా./తారాశ.తారాశశాంకము
తాలాంక.తాలాంకనందినీపరిణయము
తాళ్ల.తాళ్లపాక అన్నమయ్య కీర్తనలు
త్రిపు.త్రిపురాంతకోదాహరణము
ద.భా.శా./ద.హిం.శా.దక్షిణహిందూదేశశాసనములు
దశ./దశ.చ.దశకుమారచరిత్ర
దశా./దశా.చ.దశావతారచరిత్ర
దాశ./దాశ.శ.దాశరథీశతకము
దేవీ.దేవీభాగవతము (యక్షగానము)
ద్వి.భా.ద్విపదభారతము
ద్వి.రా.ద్విపదరామాయణము
ద్వి.సారం.ద్విపద సారంగధరచరిత్ర
ధనాభి.ధనాభిరామము
ధను.వి.ధనుర్విద్యావిలాసము
ధా.మా.ధాతుమాల
నర.శ./నరసింహ.నరసింహశతకము
నలచ.నలచరిత్ర
నల్లసో.నల్లసోమనాద్రికథ
నవ./నవ.చ./నవనాథ.నవనాథచరిత్ర
నానా.నానారాజసందర్శనము
నాసి.నాసికేతూపాఖ్యానము
నిరం./నిరంకు.నిరంకుశోపాఖ్యానము
నిర్వ./నిర్వ.రా.నిర్వచనోత్తరరామాయణము
నీ.చం.నీతిచంద్రిక
నీ.శా.ము.నీతిశాస్త్రముక్తావళి
నీతి.శ./నీతి.నీతిశతకము
నీలా.నీలాసుందరీపరిణయము
ను.క.నుడికడలి
నృసిం./నృసింహ.నృసింహపురాణము
నె.శా.నెల్లూరుశాసనములు
నైష.శృంగారనైషధము
ప.కో.పక్షికోశము (మరాఠీ)
పంచ.పంచతంత్రము
పంచ.(నా)పంచతంత్రము (నారాయణకవి)
పంచ.(వేంక)పంచతంత్రము (వేంకటనాథకవి)
పంచకన్యా.పంచకన్యాపరిణయము (యక్షగానము)
పండి./పండి.చ.పండితారాధ్యచరిత్ర
పద్మ.యు.పద్మనాభయుద్ధము
పర.వి./పరమ.పరమయోగివిలాసము
పర్వతాల.పర్వతాల మల్లారెడ్డి కథ (జానపదము)
పల./పల్నా./పల్నాటి.పల్నాటి వీరచరిత్ర
పాంచా./పాంచాలీ.పాంచాలీపరిణయము
పాండవాశ్వ.పాండవాశ్వమేధము
పాండు.పాండురంగమాహాత్మ్యము
పాణి.పాణిగృహీత
పారి.పారిజాతాపహరణము
పారి(యక్ష)పారిజాతాపహరణము (యక్షగానము)
పార్వ.పార్వతీపరిణయము
ప్రద్యు.ప్రద్యుమ్నచరిత్ర
ప్రబంధప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము
ప్రబోధ.ప్రబోధచంద్రోదయము
ప్రభా.ప్రభావతీప్రద్యుమ్నము
ప్రభు.ప్రభులింగలీల
ప్రహ్లాద.ప్రహ్లాదచరిత్రము (యక్షగానము)
ఫిర.ఫిరదౌసి
బలుమూరు.బలుమూరు కొండయ్య కథ (జానపదము)
బ.పు./బసవ.బసవపురాణము
బహు./బహుళా.బహుళాశ్వచరిత్ర
బే.ప.బేతాళపంచవింశతి
బొబ్బిలి.బొబ్బిలియుద్ధము
బ్రౌన్‌.బ్రౌన్‌ నిఘంటువు
భద్ర.శ./భద్రగిరి.భద్రగిరిశతకము
భద్రా.భద్రాపరిణయము
భల్లా.భల్లాణచరిత్ర
భాగ.భాగవతము
భద్రాయు.భద్రాయురభ్యుదయము
భాను.భానుమద్విజయము
భార.మహాభారతము
భార్గవ.భార్గవపురాణము
భాస్క.రా.భాస్కరరామాయణము
భాస్కర./భాస్క.శ.భాస్కరశతకము
భీమ.భీమఖండము
భోజ.భోజరాజీయము
భోజసుతా.భోజసుతాపరిణయము
మ.భా.మహాభారతము
మ.చ./మను./మను.చ.మనుచరిత్ర
మన్నారు.మన్నారుదాసవిలాసము
మల్ల.మల్లభూపాలీయము
మల్హ./మల్హణ.మల్హణచరిత్ర
మాత.మాతపురాణము
మార్కం.మార్కండేయపురాణము
మించు.మించుపల్లె
ముకుంద./ము.వి.ముకుందవిలాసము
మైరా.మైరావణచరిత్ర
మొల్ల.మొల్లరామాయణము
య.చ./యయా.యయాతిచరిత్ర
రం.రా./రంగ.రంగనాథరామాయణము
రంగా./రంగా.చ.రంగారాయచరిత్రము
రసిక.రసికజనమనోభిరామము
రా.వి.రాజవాహనవిజయము
రాఘవా.రాఘవాభ్యుదయము
రాజ.వి./రాజవా.రాజవాహనవిజయము
రాజగో.రాజగోపాలవిలాసము
రాజశే.రాజశేఖరచరిత్రము
రాజమోహన.రాజమోహనకురవంజి (యక్షగానము)
రాజా./రాజారామే.రాజారామేశ్వరరావు (జానపదము)
రాధా.రాధామాధవము
రాధి.సాం./రాధికా.రాధికాసాంత్వనము
రామ.శత.రామలింగేశ్వరశతకము
రామరామ.రామరామశతకము
రామలింగ./రామలిం.శ./రామలింగే.రామలింగేశ్వరశతకము
రామా.రామాభ్యుదయము
రామా.క./రామా.కల్ప.రామాయణకల్పవృక్షము
రాయ.రాయవాచకము
రావి.గు.వ్యా.రావిపాటిగురుమూర్తిశాస్త్రి వ్యాకరణము
రు.చ./రుక్మాం./రుక్మాం.చ./రుక్మాంగ.రుక్మాంగదచరిత్ర
రేఫ.ని.రేఫఱకారనిర్ణయము
ల.సా.సం./లక్షణ./లక్షణ.సం.లక్షణసారసంగ్రహము
లీలా./లీలావతీ.లీలావతీకల్యాణము (యక్షగానము)
వరాహ.వరాహపురాణము
వల్లభా.వల్లభాభ్యుదయము
వసు.వసుచరిత్రము
వాద.వాదజయము (యక్షగానము)
వాల్మీకి.వాల్మీకిచరిత్ర
వాసంతికా.వాసంతికాపరిణయము (యక్షగానము)
వాసి./వాసిష్ఠ.వాసిష్ఠరామాయణము
వి.పు.విష్ణుపురాణము
విక్ర./విక్రమా.విక్రమార్కచరిత్ర
విజయ.విజయవిలాసము
విజ్ఞా.విజ్ఞానేశ్వరీయము
విప్ర./విప్ర.చ.విప్రనారాయణచరిత్ర
వివేక.వివేక విజయము (యక్షగానము)
విశ్వే./విశ్వే.శ.విశ్వేశ్వరశతకము
విష్ణు.విష్ణుపురాణము
విష్ణుమా.విష్ణుమాయావిలాసనాటకము
విష్ణుపారి.విష్ణుపారిజాతము
వీర.వి.వీరభద్రవిజయము
వృషా.శ.వృషాధిప శతకము
వెలుగోటి.వెలుగోటివారి వంశావళి
వేం.ఆం.వేంకటేశాంధ్రము
వేం.వి.శ.వేంకటేశ్వరవిహారశతకము
వేంక./వేంక.ఆం.వేంకటేశాంధ్రము
వేంక.శత.వేంకటేశ్వరవిహారశతకము
వేణు./వేణు.శ.వేణుగోపాలశతకము
వేమన.వేమనశతకము
వై.దీ.వైకృతదీపిక
వైజ.వైజయంతీవిలాసము
శ.ర.శబ్దరత్నాకరము
శకుం.శకుంతలాపరిణయము
శచీ.శచీపురందరము (యక్షగానము)
శత.రా.శతకంఠరామాయణము
శరభాంక.శరభాంకలింగశతకము
శశాం./శశాంక.శశాంకవిజయము
శశి.శశిరేఖాపరిణయము
శా.శ.కో.శాసనశబ్దకోశము
శివ./శివ.మా./శివరా.శివరాత్రిమాహాత్మ్యము
శివ.సా.శివతత్త్వసారము
శివలీ.శివలీలావిలాసము
శిశు./శిశు.వ.శిశుపాలవధ
శు.స./శుక.శుకసప్తతికథలు
శు.నీ.సా.శుక్రనీతిసారము
శుద్ధాం.ని.శుద్ధాంధ్రనిఘంటువు
శృం.నై.శృంగారనైషధము
శృం.శా.శృంగారశాకుంతలము
శృం.సా.శృంగారసావిత్రి
శేష./శేషధ.శేషధర్మములు
శ్రవ.శ్రవణానందము
శ్రీరం./శ్రీరం.మా./శ్రీరంగ.శ్రీరంగమాహాత్మ్యము
శ్రీ.రా.శ్రీరామాయణము
షట్చక్ర.షట్చక్రవర్తిచరిత్ర
షోడశ.షోడశకుమారచరిత్ర
స.నీ.స.సకలనీతిసమ్మతము
స.సాం.స.సర్వాంధ్రసారసంగ్రహము
సం.రామా.సంక్షేపరామాయణము (జానపదము)
సంస్కృ.పదా.సంస్కృతపదార్ణవము
సక.స.సకలనీతిసమ్మతము
సతీదాన.సతీదానశూరము (యక్షగానము)
సత్య./సత్య.సాం.సత్యభామాసాంత్వనము
సదాశివ.సదాశివరెడ్డికథ (జానపదము)
సర్వేశ్వ.సర్వేశ్వరశతకము
సాం.ని./సాంబ.సాంబనిఘంటువు
సాంబో.సాంబోపాఖ్యానము
సానం./సానందో.సానందోపాఖ్యానము
సారంగ.సారంగపాణిపదములు
సారంగ.(ద్వి)సారంగధరచరిత్ర (ద్విపద)
సారంగ.చ.సారంగధరచరిత్ర (చంపూకావ్యము)
సావి.సావిత్రీచరిత్ర
సిం.ద్వా.సింహాసనద్వాత్రింశిక
సింహ.సింహగిరివచనములు
సింహా./సింహా.శ./సింహాద్రి.సింహాద్రినారసింహశతకము
సీతారా.సీతారామాంజనేయసంవాదము
సుకవి.సుకవిమనోరంజనము
సుదక్షి.సుదక్షిణాపరిణయము
సుమతి.సుమతిశతకము
సూ.ఆం.ని.సూర్యరాయాంధ్రనిఘంటువు
సౌంద.సౌందరనందము
హంస.హంసవింశతి
హర.హరవిలాసము
హరి.హరివంశము
హరి.(ఉ)హరివంశము (ఉత్తరభాగము)
హరి.(గౌ)హరిశ్చంద్రోపాఖ్యానము (గౌరన)
హరిశ్చం.హరిశ్చంద్రోపాఖ్యానము
హేమా./హేమాబ్జా.హేమాబ్జానాయికా స్వయంవరము
నిఘంటు శోధన