| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 37. పొగాకు పాట |
|
రాయ పొగాకా పాయ పొగాకా మద్దూరి లంకది మంచి పొగాకు. ఆలీ మొగలీ సందు అలుకూలూ వచ్చాయి అలుక తీర్చల్లే కులుకు పొగాకా చెవుల పిల్లి చెంచెయ్యగారి చెట్ల పొగాకా ఈడిగలు తాగేటి ఈకల పొగాకా కాపూలు తాగేటి కంపు పొగాకా మాలోళ్ళు తాగేటి మంచి పొగాకా రాయ పొగాకా పాయ పొగాకా మద్దూరి లంకాది మంచి పొగాకు. |