| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 44. చేనుకోత పాట |
|
ఏలే మాలి ఏలే మాలి ఏ... సో - ఓహో... ఏటీ మీద పనా మాలి - ఏ... సో... ఏటీ వార యేపా జెట్టు - ఏ... సో... ఎక్కీ చూస్తె ఢిల్లీకోట - ఏ... సో... ఢిల్లీకోట చల్లాగుంటె - ఏ... సో... చిల్లారప్పులు చెల్లాగొడత - ఏ... సో... పాలా పాల పాలా పాల - ఏ... సో... పాలా పాల బలుసూ కూర - ఏ... సో... నేలా నేల నెల్లీకూర - ఏ... సో... పుట్టామీద పాలాపిట్ట - ఏ... సో... కొట్టాబోతే తేలూకుట్టె - ఏ... సో... బావాగారు మంతారించె - ఏ... సో... భళ్లూ భళ్లున తెల్లావారె - ఏ... సో... నేలా నేల నేలా మీద - ఏ... సో... అలీ కొమ్మల చింతా చిగురూ - ఏ... సో... వండీ పెడ్తిమి వలపూ తీరె- ఏ... సో... |