| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 46. దంపు పాట |
|
దంపు దంపా లేను దంపా చూడా లేను దండెత్తి ధాన్యమూ దంచాగా లేనూ సువ్వి - హా - సువ్వి. నిమ్మలా బుగ్గపాప పుట్టీనాడూ నిమ్మతోటకు తోడి నీరెట్టినాడూ నిలువునా నిమ్మల్లు లేచి కాయంగ నిగనిగా పండ్లన్ని బుట్టాలు నిండ సువ్వి - హా - సువ్వి. సంతకూ బుట్టలూ బండ్లాతో చేర్చె సంతోషమున డబ్బు జేబూలొకొచ్చె సరసాల కాతోట సల్లన్ని తోట సంతపోయే జనపు సంపెంగ తోట సువ్వి - హా - సువ్వి. |