| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 50. వెక్కిరింతలు |
|
పూవూ లెట్టిందిరోయ్ పూవూ లెట్టిందిరోయ్ పూవుల కోక మీద పునుగూ పూసిందిరోయ్ బొట్టూ పెట్టిందిరోయ్ బొట్టూ పెట్టిందిరోయ్ బొట్టూలాంటి ముక్కు బాసా పెట్టిందిరోయ్. నన్నూ చూసిందిరోయ్ నన్నూ చూసిందిరోయ్ నన్నూ చూసినంత నవ్వే, లేసిందిరోయ్. |