| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 63. ఓ చిన్నదానా |
|
బంగారు చినదానా బంగారు జడలదానా బంగారు జడలామీదా ఓ చిన్నదానా మోజెన్నడు లేదే ఓ చిన్నదానా గుంటూరు చినదానా గుండ్రాని కల్లదానా గుండ్రాని కల్లమీదా మోజెన్నడు లేదే ఓ చిన్నదానా మోజెన్నడు లేదే ఓ చిన్నదానా నల్లా నల్లాని దానా నాతీ నడకాలదానా నాతీ నడకాలామీదా మోజెన్నడు లేదే ఓ చిన్నదానా మోజెన్నడు లేదే ఓ చిన్నదానా... |