| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 69. యేల పాట |
|
ఆకుచిన్నా అడివీలోనా నాకుచిన్నా దండా దొరికే దండపేరు కట్లదండేగా ఓ కొంటెగాడా దండసొగసూ చూడగావలెరా చిన్న చిన్నా పువులూ కోసీ చిన్నదానీ కొప్పూ ముడిచీ చల్లనేలల నన్ను దలచేరా ఓ కొంటెగాడా కొప్పు సొగసూ చూడగావలెరా భద్రగీరి కోనాలోనా చిత్రమయినా దండా దొరికే చిత్రమయినా బొమ్మమీదానూ ఓ కొంటెగాడా చిలిపిమనసు చిందులాడేరా కానరానీ అడవిలోనా విత్తులేకా చెట్టూ పుట్టే కొమ్మలేనీ చెట్టుమీదానూ ఓ కొంటెగాడా రెక్కలేనీ పక్షి పుట్టేరా. |