| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 73. పూల పాట |
|
బంతి పూచిందీ బంతి పూచిందీ బంతూలవలె - పూ బంతి పూచిందీ. మల్లి పూచిందీ మల్లి పూచిందీ మాయింటమల్లె - పూ గుత్తీ పూచిందీ. పూవూ నవ్విందీ పూవూ నవ్విందీ పూలకన్య సిగలో పూవూ నవ్విందీ. కన్నె మురిసిందీ కన్నె మురిసిందీ సిగలోన పూలుచూసి కన్నె మురిసిందీ. |