| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా |
| 39. తత్త్వం |
|
జ్ఞానీ ఎరుగు సుజ్ఞానీ ఎరుగు మంచీ నీళ్ళారుచి మత్స్యా మెరుగును కాని గుట్టాలంపట తిరిగే కోడి ఏ మెరుగూ ... పిల్లాలా ఆకలి తల్లీ ఎరుగును కాని అడవులంట తిరిగే అయ్య ఏ మెరుగూ ... భార్యా చేసిన తప్పు భర్త ఎరుగును కాని వీధులంట తిరిగే జోగీ ఏ మెరుగూ ... మల్లెపూల రుచీ తుమ్మెదెరుగును కానీ మనమీదా వాలేటి ఈగా ఏ మెరుగూ ... |