| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
018. పొలిపదం
| రైతు తెలివితక్కువవాడైతే ఎంత పంటయినా గుడగుడాయిస్వాహా అవుతుంది. చివరికి మిగిలేది ఏమిటి? చిత్తగించండి. |
|
కల్లు దుర్గామొచ్చి; గూగుమ్మడి; కళ్ళములో, కూకుండే; గూగుమ్మడీ; చేత పైసాలేదు, గూగుమ్మడీ; ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ; కాడి యెద్దులనమ్మి; గూగుమ్మడీ; కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ; కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ; కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ; చేతపైసాలేదు, గూగుమ్మడీ; ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ; పాడి బర్లానమ్మి; గూగుమ్మడీ; కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ; కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ; కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ; చేతపైసాలేది, గూగుమ్మడీ; ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ; తల్లిదండ్రులనమ్మి; గూగుమ్మడీ; కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ; కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ; కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ; చేతపైసాలేది, గూగుమ్మడీ; ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ; పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ; కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ; పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ; బ్రతుకకుంటే నేమి? గూగుమ్మడీ; కల్లు దుర్గామపుడు; గూగుమ్మడీ; కళ్లమొదిలీపోయె; గూగుమ్మడీ; |
| చావుకు పెట్టిననేకాని లంఖణాలవరకూ రాదు. పెళ్లాన్ని పరులకమ్మేవరకూ నడుపుతుందా కల్లు త్రాగుడు? అయితే వద్దన్నాడు. కల్లుదుర్గము కళ్లమువదలి పారిపోయింది. |