| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
024. పార పదం
| వచ్చె వచ్చె వానజల్లు జాలమదియేల గుచ్చుకునె రేగుముల్లు జాలమదియేల చక్కగొట్టే చిన్నవాడా జాలమదియేల చక్కవిరిగి చంపదగిలే జాలమదియేల వచ్చె వచ్చె వానజల్లు జాలమదియేల గుచ్చుకునె రేగుముల్లు జాలమదియేల |
| చక్క విరిగి చెంపదగులుటలూ, ముళ్ళు గుచ్చుకొనుటలూ ఈ పాటలలో తరుచు వినబడుతాయి. ముల్లు గుచ్చుకొనుట పరిపాటియే. చెక్కలు ఎగురుట కూడా సకృత్తు. చెంప దగులుట వింత. |