| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
031. విసురురాతి పదములు - 1
| విసురురాతి పదములని పశ్చిమాంధ్ర సీమలో చాలా పదములున్నవి. విసురురాతికి శృతి తోనే కాని తాళముతో సంబంధము లేదు. కనుక ఈ పాటలలో తాళపు బిగుతు వుండదు. ఊహలూ, భావాలూ మాత్రమే పొడుగు పెంచుకుని పట్టుకుంటాయి. కథనము కనబడుతుంది వీటిలో ముఖ్యంగా. మచ్చుకు నాలుగు పాటలు. |
|
ఆదివారము నాడు అమావాస్య నాడు అన్న ఇంటికి నేను గిన్నెనడుగ బోతె మా వదినె శాంభవి లేదు పొమ్మనెను మాయన్న మంచివాడు మళ్ళి రమ్మనెను చిన్నోనికి చీటంగి సిలుకు కుళ్ళాయి బాలునికి పొట్లంగి పాలు పోసె గిన్నె నాకు నల్లచీర నెమలి వన్నె రవికె వడినిండ బియ్యము వళ్ళొ కొబ్బరిగిన్నె పసుపు కుంకుమ ఇచ్చి పంపె మాయన్న ॥ |