| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
048. చెఱకుతోట కోపు
| ఇవి చిత్తూరు సీమవి. చెఱకు రైతుల పాట్లు చక్కగా చూపిస్తవి. |
|
ఏలేస్తివి నరసన్న చెఱకుతోట ఎందుకేస్తివి నరసన్న చెఱకుతోట చుట్టుముట్టు తోటల్ని చెఱకుతోట చుట్టుకాని కొచ్చినాయి చెఱకుతోట నరసన్న తోట లోన చెఱకుతోట నక్కకొరక పచ్చిలేదు చెఱకుతోట అయగాళ్ళ కింతపోయె చెఱకుతోట సాయగాళ్ళ కింతపోయె చెఱకుతోట అప్పులోళ్ళ కింతపోయె చెఱకుతోట అడిగినోళ్ళ కింతపోయె చెఱకుతోట |
| 'కిటతక కిటతక' అని చతురశ్ర గతిలోనే నడుస్తవి ఇవి. |