| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
053. పరమాన్నం
| భూమికి తాళాలేస్తే రంగా అల్లోభోగం దాడ్తే రంగా బోగందానికి సవురం దొరికె సవురం కొండూపోయీ అమ్మాకిచ్చె అమ్మా బుడ్డెలు పాలుపోసె పాలుకుండా పోయి పరమాన్నమొండే మొగొన్కి పెట్టెరా మొర్రి చిప్పాలో బిడ్డాకు పెట్టెరా బొడ్డూ గిన్నేలో అది వెట్టుకొనే యెండీ గిన్నేలో మొగొన్కి పోసెరా కప్పాల కడుగు బిడ్డాకు పోసెరా రొయ్యాలా పులుసు అది పోసుకొనెరా గంగావు నెయ్యి మొగొన్ని కరచే మొద్దుల్ల పాము బిడ్డన్ని కరచే బెడ్డాల తేలు దాన్ని కరచే కట్టకింది కాకి మొగొన్ని బెట్టెరా మొద్దూల కింద బిడ్డాని పెట్టె బెడ్డలకింద దాన్ని పెట్టె కట్ట కింది దొట్లె |