| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
060. నందిరెడ్డి
| నందిరెడ్డి కూడా ఇటువంటి దుర్మరణము పాలైనవాడే. చందమామ వంటి అందచందాలున్న వాడట. కాంతా లోలుపత్వమే అతని పాటుకు కారణమేమో ననిపిస్తుంది. వినండి. |
|
రాజా మా నందిరెడ్డీ నీకిలలో బత్తెము తీరెనా కొడుకా మా నందిరెడ్డీ మల్లు పంచె కట్టుకోనీ నల్లకోటు తొడుక్కోనీ పల్లెదోవన బోతవుంటే పాలెగాడనుకొంటిరా కొడుకా మా నందిరెడ్డీ కట్టమీదా బోతవుంటే కలకటేరనుకొంటిరా కొడకా రాజా మా నందిరెడ్డీ నీకిలలో బత్తెము తీరెనా నున్నంగ తలదువ్వి నూగాయ జడలేసి సందువెంట బోతావుంటె సందమామను కొంటిర కొడకా వచ్చి పొయ్యే దోవలోన దానిమ్మ చెట్టుకింద వెండికుచ్చే నేలబడితే ఏటుకే తెగనరికెనన్నా |