| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
070. వెర్రి బావ
| వెఱ్ఱి బావను ఉడికిస్తుంది గడుసు పెండ్లాము. అడుగడుగునకూ అనుమానము కలిగిస్తూ చిక్కు విప్పేస్తుంటుంది. |
|
ఒకరీకీ చేతులిచ్చాన్ ఒకరీకీ కాళ్ళనిచ్చాన్ ఒకరీని చేతబట్టీ కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ ఎవరీకీ చేతులిచ్చావ్ ఎవరీకీ కాళ్ళనిచ్చావ్ ఎవరీని చేతబట్టీ కూకున్నావే పిల్లా కూకున్నావే గాజుల్కీ చేతులిచ్చాన్ కడియాలకీ కాళ్ళనిచ్చాన్ డబ్బుల్నీ చేతబట్టీ కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ ఒకరీనీ నానావేశాన్ ఒకరీని చితకా కొట్టాన్ ఒకరీని చుట్టచుట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ ఎవరీనీ నానావేశావ్ ఎవరీని చితకా కొట్టావ్ ఎవరీని చుట్టచుట్టి కూకున్నావే పిల్లా కూకున్నావే సున్నాన్నీ నానవేశాన్ వక్కల్నీ చితకా కొట్టాన్ ఆకుల్నీ చుట్టాచుట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ ఒకరీనీ కట్టివేశాన్ ఒకరీనీ వదిలివేశాన్ ఒకరీనీ చేతబట్టీ కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ ఎవరీనీ కట్టివేశావ్ ఎవరీనీ వదిలివేశావ్ ఎవరీనీ చేతబట్టీ కూకున్నావే పాపీ కూకున్నావే ఆవుల్నీ కట్టివేశాన్ దూడల్నీ వదిలివేశాన్ చెంబూనీ చేతబట్టీ కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్ |