| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
073. గొబ్బీయళ్ళో
| ఇవి చూడండి. పల్లెటూరి నీలాటిరేవు కడ దృశ్యములు. |
| పెద్దది అక్కెమ్మ పెదబాన తోడ | గొబ్బీయళ్ళో | గొబ్బీయళ్ళో |
| పెద్దది అక్కెమ్మ నీళ్ళకుపోయె | " | " |
| ఎంతచక్కగా ఏడుమెట్లు దిగె | " | " |
| గడగడన కడవ కడిగి బుడబుడన ముంచే | " | " |
| చుట్టూపక్కల చూచె ఎవ్వరులేరు | " | " |
| కట్టపైన పోయేటి గింగుట్ల రాజు | " | " |
| కడవట్ల యెత్తుదువూ రావయ్య రాజ | " | " |
| ఎత్తితే ఎత్తేను పేరేమి చెప్పు | " | " |
| పేరేమి చెప్పేది పేదోళ్ళ పాప | " | " |
| నా పేరు వజ్రమే కడవ పేరు ముత్యమే | " | " |
| అక్కెమ్మ అన్నమాట పెద్దపిల్ల అన్న అర్థముతో దేశి సారస్వతములో కనబడుతుంది. అది సామాన్యనామ మన్నమాట. |