085. బ్రతుకమ్మ పాట
| బ్రతుకమ్మ పాటలు తెలంగాణములోనివే. అయితే ఈ పాటలో 'చందమామ' అన్న పాదాంత పదమున్నది. ఇంకొక పాటలో |
| - అది అచ్చు కూడా అయినది - వలలొ అనీ ఉయ్యాలొ అనీ పాదాంత పదములున్నవి. బ్రతుకయ్య విష్ణువు, బ్రతుకమ్మ లక్ష్మీ దేవి. బ్రతుకమ్మ పండుగలు మాత్రము తెలంగాణమున తప్ప వేరేచోట జరుగుతున్నట్టు మాకు తెలియదు. ఈ పాట గోవింద నామముల వరుసలో నుండుట విశేషము. |
| శ్రీలక్ష్మి దేవియు | చందమామ | । | సృష్టి బతుకమ్మయ్యె | చందమామ |
| పుట్టినా రీతిచెప్పె | " | | భట్టు నరసింహ కవి | " |
| ధరచోళ దేశమున | " | | ధర్మాంగుడను రాజు | " |
| ఆరాజు భార్యయు | " | | అతి సత్యవతి యండ్రు | " |
| నూరునోములు నోమి | " | | నూరుమందిని గాంచె | " |
| వారు శూరులయ్యు | " | | వైరులచే హతమైరి | " |
| తల్లిదండ్రులపుడు | " | | తరగనీ శోకమున | " |
| ధనరాజ్యముల బాసి | " | | దాయాదులను బాసి | " |
| వనితతో ఆ రాజు | " | | వనమందు నివసించె | " |
| కలికి లక్ష్మిని గూర్చి | " | | ఘనతపం బొనరించె | " |
| ప్రత్యక్షమై లక్ష్మి | " | | పలికె వరమడుగుమని | " |
| వినుతించి వేడుచూ | " | | వెలది తనగర్భమున | " |
| పుట్టుమని వేడగా | " | | పూబోణి మది మెచ్చి | " |
| సత్యవతి గర్భమున | " | | జన్మించె మహలక్ష్మి | " |
| అంతలో మునులునూ | " | | అక్కడికి వచ్చిరీ | " |
| కపిల గాలవులునూ | " | | కశ్యపాంగిరసులు | " |
| అత్రి వశిష్టులూ | " | | ఆకన్నియను జూచి | " |
| బ్రతుకుగనె యీతల్లి | " | | బ్రతుకమ్మ యనిరంత | " |
| పిలుతు రదివరనుండి | " | | ప్రియముగా తలిదండ్రి | " |
| బ్రతుకమ్మ యని పేరు | " | | ప్రజలంత అందరూ | " |
| తాను ధన్యూడంచు | " | | తనబిడ్డతో రాజు | " |
| నిజపట్టణము కేగి | " | | నేల పాలించంగ | " |
| శ్రీమహా విష్ణుండు | " | | చక్రాంకుడను పేర | " |
| రాజు వేషంబున | " | | రాజు ఇంటికి వచ్చి | " |
| ఇల్లింట మనివుండి | " | | అతివ బ్రతుకమ్మను | " |
| పెండ్లాడి కొడుకులా | " | | పెక్కుమందిని గాంచె | " |
| ఆరువేల మంది | " | | అతి సుందరాంగులు | " |
| ధర్మాంగుడను రాజు | " | | తన భార్య సత్యవతి | " |
| సరిలేని సిరులతో | " | | సంతోషమొందిరీ | " |
| జగతిపై బ్రతుకమ్మ | చందమామ | । | శాశ్వతంబుగ వెలసె | చందమామ |
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - bratukamma pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )