| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
095. గొల్లవారము
| గొల్లవారము సద్గురుని సేవకలవారము | |
| చీకటికోనలోన చిట్టడవి మేసే పశువుల చిత్తమందున దొడ్డికట్టి చెదరకుండా మందతోలే | ॥గొల్ల॥ |
| వరయోగ తిరుమంత్రమును వదలక సేవించేవారికి ... .... .... .... చల్లలమ్మే | ॥గొల్ల॥ |
| గోప్యమైనా తిరుమంత్రమును గొడ్డలొకటి చేతబూని అండగోరండమైన అడవి నరకి దొడ్డి కట్టే | ॥గొల్ల॥ |
| అందమైన బిందెలోన చెదరకుండా పాలుపితికి పొంకమైనా అడుపుమీదా పొంగకుండా పాలుకాచే | ॥గొల్ల॥ |
| శాంతమను పాలారబోసి, చతురాక్షరమున తోడూ యుంచి ఆత్మయనియెడు భాండములోనా, అందముగా తైరుదరచే | ॥గొల్ల॥ |
| తిరుమంత్రమను కవ్వము బట్టి, ద్వైమంత్రమనే తైరుతరచి శరణార్థియను వెన్న దీసి, చెదరకుండా ముద్దాచేసే | ॥గొల్ల॥ |
| అన్నివిధముల అమరగాచి, వన్నెమీరా నెయ్యిదీసి వినయమైన విన్నపముతో నిష్టతో నిజగురుని చేరే | ॥గొల్ల॥ |
| హఠయోగుల గుప్తతత్త్వాలు గుర్తుకు వస్తున్నవి. వడగళ్ వైష్ణవము భక్తునికి అధికార అర్హతను నిర్ణయిస్తూ సాధన పట్ల కొంత గోప్యతను కోరుతుంది కాబోలు. అందుకేనేమో ఈ పాట ఇళ్ళలోనే గాని వీధిలో వినబడక పోవటము. |