| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
110. పొట్టేలు
| పొగరెక్కి పొట్టేలు పొడిచేయునో పిల్ల తొగరు చీరపిల్ల తోవలో లెగు లెగు పచ్చగట్టు మేసి వక్రించినది కొమ్ము మచ్చికదనుకోకు మార్గాన లెగు లెగు బొచ్చుమెడ చిరుగంట బురణించి రవణించు ముందంజ వేయకు పుంతలో లెగు లెగు కచ్చ పోసిన పిల్ల కాలందె ఘలపిల్ల వచ్చుచున్న పిల్ల వయ్యారి పిల్ల |