| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
115. జాలుమాలి
| జాలుమాలి జాలుమాలీ జాలిరవో బేడిజిల్లా కాకినాడ రేవులోను జాలుమాలి జోడుకొయ్యెల వోడవచ్చె జాలుమాలి వోడమీద సిన్నవోడ జాలుమాలి యేళ్ళనిండ వుంగరాలు జాలుమాలి వుంగరాల సెయ్యిసూచి జాలుమాలి వుండదేర ముండ మనసు జాలుమాలి |
| ఈ పాటలో 'జాలుమాలి' అన్న పదమును కళాసీలందరూ చేరి పలుకుతారు. మాటలు పదము చెప్పేవాడు చెప్పుతుంటాడు. ఈ పాటలో కథ అల్లిక కనబడుతున్నది. పడవను విడిచి పాట ఓడను పట్టినది. ఓడలో ప్రయాణీకులు పెక్కురు. |