| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
123. పంచెవన్నెల సిలక
| ఇటువంటిదే ఇంకొక పాట. ఈ పాటలో చిన్నది జవాబిస్తున్నది. అయితే అభిమానము కాదు, ఆమెను పలికిస్తున్నది; అచ్చెరువు! |
|
మంచెదిగవే పాంచాల సిలకా మంచె దిగవే మంచె దిగవే ఓ పంచెవన్నెల సిలకా వొంచీన తలయెత్తి వాలూ సూపులు సూసి మంచె దిగవే పాంచాల సిలకా ॥మంచె దిగవే॥ సేబాసు కురవాడా సెవులా పోగులవాడ మాబావ కన్న విన్న మరియాద దక్కునా మంచె దిగనూ నేను కంచె దాటి రానూ ॥మంచె దిగనూ॥ అల్లాము బెల్లాము తెల్లా కొంగున కడుదు తెల్లా కొంగున కట్టి తెల్లవారే సరికి పోదు మంచె దిగవే పాంచాల సిలకా ॥మంచె దిగవే॥ అల్లాము బెల్లాము వల్లాదు నా మనసు అన్నాదమ్ములు సూత్తె ఆబోరు నిలవాదు మంచె దిగనూ మంచి మురుగుల వాడా ॥మంచె దిగనూ॥ పూలా రైకాదాన వాలూసూపుల దానా కాలులో ములుదిగేనూ కాసింత ములుతీయే మంచె దిగవే పాంచాల సిలకా ॥మంచె దిగవే॥ కాలిలో ములుదిగితె కఱ్ఱి మంగలి గలడు తాలీ కట్టీనోడు తాయెత్తు కట్టూను మంచె దిగనూ పొంచున్న సినవోడా ॥మంచె దిగనూ॥ |
| అల్లిక గుత్తముగా లేకున్నా నాగరిక రచన వలె కనబడలేదు ఈ పాట. విన్నవారి అపేక్షను పట్టి ఉంచటానికి చిన్నదాని చేత జవాబు చెప్పించాడు జానపద రచయిత. |
| ఈ రకపు పాటలు చెంచు నాటకములలో కూడా కనబడుతవి. సింగడు |
వేళ్ళకు తగ్గ కనకపు శ్రీ మెట్టెలిచ్చేనూ॥ |
| అంటే సింగి |
వేళ్ళకు తగ్గ కనకపు శ్రీమెట్టెలొల్లనూ॥ |
| అని జవాబు చెప్పే పాటను దోణప్పగారు పేర్కొనినారు. ఈ పాటలు వాడుకలో నున్నవే నాటకముల లోనికి దిగియుండు ననుటే సమంజసమేమో. ఏలలూ, లాలి, జోల, శోభనము, తలుపు దగ్గర పాట, మేలుకొలుపు, ఉయ్యాలపాట అన్నవన్నియును వాడుకలో నున్నవి నాటకములో ప్రవేశించినవి. |