| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
130. బంగారి సామి
| ఈ పాట ప్రేయసీ ప్రియుల పరిచయారంభమును ధ్వనిస్తున్నది. చంద్రుణ్ణీ, గాలినీ, కోయిలనీ తిట్టుకొంటూ పూలపాన్పు మీద బైఠాయించు ప్రబంధ సుందరుల ఉపన్యాసముల ప్రక్కన 'కమ్మగెగ్గిరి వాసనకే ఉండరాదుర ముండ నా మనసు' అను ఈ చిన్నదాని కాంక్ష శిలావిగ్రహము ప్రక్కన చిన్నదాని వలె కనపడుట లేదా? |
|
సెక్కుమీదను సన్నగోరూ, సెంపనా జవ్వాది పూతా సొంపుగా నీ కెవరు బూసీరే, చక్కాని బాలా ఇంపుగా నీకెవరు బూసీరే? ఇత్తరీ జొన్నెన్ను కొలుతూ, ఈనినావుల పాలు గొలుతూ రాగిమానూ పూలు గొలుతబ్బీ, బంగారి సామి నడిసిరారా నాదు సరసాకూ కుంకమూకురువేను చేనూ, దవనమూ దానింటి తడికే వంగిరారా సుంకు తగిలేనీ, బంగారి సామి తములపాకు మడుపులందేనీ కుట్ర కుట్ర సినుకు లోన ఉంటిరా దానింటి యెనక దూడ తొత్తు మాట వినేరా? బంగారి సామి దుక్కి పంటా నానిపోయెరా గారడీ దానింటి వెనక, మావిడీ కొమ్మాలు రెండు అందలేదూ పొందలేదూర, బంగారి సామీ అన్నెకారీ కోడి కూసెరా గాజులుండే సేనిమీదా కమ్మగెగ్గిరి సెట్టుపుట్టా కమ్మగెగ్గిరి వాసనాకేరా, బంగారి సామి ఉండలేదుర ముండ నా మనసు |