| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
142. బంగారి పిల్లా
| ఈ చిన్నవాని ప్రేముడి బూటకము గాదేమో. 'బంగారి పిల్ల' కు అందపు దుస్తులు తెత్తు ననుచున్నాడు. |
|
ఓ సిలిపిమాట సిన్నదాన సిలకపూల సీరబెట్టేనే ఓ రామసిలకా రంగసానీ రంగురంగుల రయిక దొడిగేనే మునుము బట్టి కూరుసుంటే గనిమ దాకా పలకరించవు పట్టుపూలా సీర దెచ్చేనే బంగారి పిల్లా పట్టు కుచ్చులు నీకు దెచ్చేనే |
| గట్టిదే! మునుము పట్టి కూర్చున్న 'కనుమ' దాకా పలకరించదు. ముచ్చటలన్నీ రాబట్టుచున్నది. కనుమ కడనైనా పలకరించకుంటే ఎట్లా? |