144. గంగమ్మ పాట
| వీడు ప్రబంధములు చదివిన వాడు. అందును నలుని దమయంతీ అభ్యంతరమందిర ప్రవేశమును తప్పక పఠించి యుండును. గంగమ్మ వెర్రిదేమీ కాదు. ఊరించి ఊరించి ప్రేమించినది. |
| వంగసెట్లా పక్క | గంగమ్మా |
| నీవు వంగి సూత్తుంటే | " |
| పానం జల్లుమనె | " |
| నీవు పక్కకెందుకు రావు | " |
| పక్కాన నిలుసుండి | " |
| నీవు ఒక్కసారి ముడితె | " |
| నీ కంట్లోకి సూత్తానె | " |
| నేనొల్లు మర్చిపోతా | " |
| అనుమాండ్ల గుడికాడ | " |
| నువు వంగి మొక్కంగా | " |
| నీ కొంగు జారెనే | " |
| బుద్ది దీరంగ జూస్తినే | " |
| మీ యింటి యెన్కాల | " |
| పూల సెట్లల్లోన | " |
| పూలు తెంపుతుంటె | " |
| నీ సీర సినిగిపోయె | " |
| సీర పోతే పోయె | " |
| ఒక్కసారి రావె | " |
| వచ్చీ సూడకుంటె | " |
| నేన్సచ్చి పోతానే | " |
| దొంగసూపు సూత్తె | " |
| నేన్వంగి వంగి సూత్త | " |
| రంగదేవుని కాడ | " |
| నువు దొంగపూజ సేత్తవు | " |
| దొంగ పూజెందుకే | " |
| నాకు వంగి సలామను | " |
| నిజమే. దొంగపూజలెందుకూ? స్వయముగా పోయి అతని బండారమును చూచినట్లయితే తెలిసి పోవును గదా! |
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gaMgamma pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )