| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
147. యెరికిలీ
| ఈమె జారిణి. తన అన్వేషణమునూ, రంకువాండ్ర నీతినీ కూడా చక్కగా ఉపన్యసిస్తున్నది. తార చెల్లెలు. వాడు మాత్రము 'యెరికిలి'. |
|
గాజులుండే చేతిలోన గందవొడి పూత పూసి వీధి వీధులు పలవరించురా - ఓ యెరికిలీ వీధి వీధులు పలవరించురా బావిలో బచ్చల్లి కూర చేనిలో చెంచల్లి కూర చెంపకూ సంపెంగ నూనెరా - ఓ యెరికిలీ చెంపకూ సంపెంగ నూనెరా నూగు నూగు మీసమోడ, నూగుచెట్ల కావిలోడ పరగచేని బాట తెలుపుమురా - ఓయెరికిలీ పరగచేని బాట తెలుపుమురా కూడు పెడతా తినిపోరా, కూడా వస్తా తోడుకపోరా ముళ్ళు లేని మొల్ల కిందికీ - ఓ యెరికిలీ ముద్దులాడి మళ్ళీ పంపురా ఈతమానూ యిల్లు కాదూ, తాటిమానూ తావు కాదూ తగరం బంగారు కాదురా, ఓ యెరికిలీ తగులుకున్న మొగుడు కాదురా |