| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
149. వలచిన చిన్నవాడు
| ఇటువంటి నాయికయే వలపుకాడు కికురించి మాయమైనందుకు విలపించుచున్నది. |
| వాడు, | వలచినాడమ్మా! నను తలచినాడమ్మా! | ... చందమామోయ్॥ |
| వాడు, | వలచినా! తెల్లారి పిలచినా! పలుకడు! | ... చందమామో! |
| వాడు, | పిక్కల సన్నంపు బిగువైన మగవాడు! | ... చందమామో! |
| వాడి, | భుజాన ఉన్నది భూచక్ర కంబళి! | ... చందమామో! |
| అది, | పదిగళ్ళు భూమిపై పరచినా చాలమ్మా! | ... చందమామో! |
| వాడి, | మునిపళ్ళ సందున ముత్యాలు తాపిస్తు; | ... చందమామో! |
| వాడి, | పక్కాన ఉన్నది పచ్చల పిడిబాకు; | ... చందమామో! |
| అది, | ఎదలోన ఒకసారి అదిమినా చాలోయి; | ... చందమామో! |
| వాడు, | వలచినా దాకాను వలపోసి తిరిగాడు; | ... చందమామో! |
| వాడు, | వలచినా తెల్లారి పిలచినా పలుకడు; | ... చందమామో! |
| వాడు, | కలకలా నవ్వాడు కన్నెత్తి చూడడు; | ... చందమామో! |
| వాడి, | కావి పంచెలమీద కస్తూరి తాపిస్తు; | ... చందమామో! |
| వాడి, | బంగారు చెక్కిళ్ళు రత్నాలు మెరిపిస్తు; | ... చందమామో! |
| వాడి, | ముద్దైన మోముపై ముత్యాలు విరబోతు; | ... చందమామో! |
| వాడి, | నూనూగు మీసాలు వలపు తీగెలు పాకిస్తు; | ... చందమామో! |
| వాడు, | చూచినా చాలమ్మ స్వర్గమే దరిదాపు; | ... చందమామో! |
| వాడు, | నవ్వుతూ మాటాడి కవ్వించి పోయాడు; | ... చందమామో! |
| వాని, | నవ్వులోనే మనసు నను విడిచి పోయింది; | ... చందమామో! |
| వాడు, | పలికినా చాలమ్మ ప్రాణాలు వికసించు; | ... చందమామో! |
| వాని, | బంగారు మొలత్రాడు పై పైన మెరిసింది; | ... చందమామో! |
| వాడి, | ఉంగరాల జుట్టు రంగైన మగవాడు; | ... చందమామో! |
| వాని, | కోపాన ఒకసారి కసరి తిట్టిన చాలు; | ... చందమామో! |
| వాడు, | ముసి ముసి నవ్వుతో మురిపించి పోయాడు; | ... చందమామో! |
| ఆ, | మగవాని కౌగింట మరణించినా చాలు; | ... చందమామో! |
| వాడు, | కంటికి కనబడితే కదులునా అడుగేసి; | ... చందమామో! |
| దీనికి జవాబనిపించు పాట చిన్నవాని భావాలు కూర్చినది ఉన్నది. కాని ఆమె దేహ సౌందర్యమునూ, అంగ సౌష్టవమునూ నెమరు వేయునది ఆ పాట. |
| వలపుకత్తె ఇంకొకర్తె తన నరసయ్య మామతో చెప్పుకుంటున్నది. |
| దూరభారము దున్నబోకు దిబ్బలెక్కి చూడలేను ఊరు ముంగిట ఉలవసల్లబ్బి ఓరందకాడ నరసయ్య మామ ఉలవకోతకి పిలువనంపబ్బి. |