| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
156. రూపాయి
| వీడు కుంటెనకాడు. ఆమె అనురక్త. ఏదోరీతిని సంతుష్టి పడునేమోనని మోగించుచున్నాడు. కాని నాణెము ఓటిది కాదు. |
|
రూపయి కావాలా రూపయి చిల్లర కావాలా రూపురేక సల్లగుంటె రూపయెందుకు రూపయి సిల్లరెందుకు నానల జీలకరి మొగ్గ పావల కావాలా పావల డబ్బులు కావాలా, పిల్లా పాదాలు సల్లగుంటె పావలెందుకు పావల డబ్బులెందుకు నానల జీలకరి మొగ్గ సీరలు కావాలా, సిలుకు సీరలు కావాలా, పిల్లా సిరిగల నీమోము సూత్తె సీరలెందుకోయి బావ సారెలెందుకోయి బావ, నల జీలకరి మొగ్గ |