| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
160. నేచిన్నదాన్నిరా
| ఇది యెవరో చిన్నతనము వదలకుండనే తొందరపడినది. చేయికాలిన పిదప ఆకులు పట్టుకొను చున్నది. |
|
వడ్లతట్టెత్తుకోని - వలసలకునేబోతె వలసలోనాకొప్పు - గొలుసూడెరాజా బాలరో నే చిన్నదాన్నిరా! చెలియరో నే చిన్నదాన్నిరా! ఈదులకుంటాకు - నీళ్లకునేబోతె ఈతముల్లూ తగిలి - ఈడేరెరాజా బాలరో నే చిన్నదాన్నిరా! చెలియరో నే చిన్నదాన్నిరా! కడియాల కుంటాకు - నీల్లకునేబోతె కవిలిముల్లూతగిలి - కడుపాయెరాజా బాలరో నే చిన్నదాన్నిరా! చెలియరో నే చిన్నదాన్నిరా! తుమ్మాలకుంటాకు - నీళ్లకు నేబోతె తుమ్మముల్లూ తగిలి - తిమ్మణ్ణి నేగంటి బాలరో నే చిన్నదాన్నిరా! చెలియరో నే చిన్నదాన్నిరా! అల్లో నేరేడుపండు - అరచేతులుండంగ పసిపింద కొరికినా - ఫలమేమి రాజా బాలరో నే చిన్నదాన్నిరా చెలియరో నే చిన్నదాన్నిరా తుమ్మెదలు చెలరేగి - దూలాలు తొలవంగ మొగసాలికేమన్న - మోసమా రాజా బాలరో నే చిన్నదాన్నిరా చెలియరో నే చిన్నదాన్నిరా |