| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
170. వాలుకన్నుల వెంకటస్వామి
| ఓ వాలు గన్నుల మువ్వ వెంకటస్వామి నిన్ను నేను విడువజాలరా; ఇంటి ముంగల ఇనప రోలు సేతిన శాబంతి రోకలి దంచి దంచి నీ వంక సూసితే ధరణి మీద కాలు నిలువదు వెంకటస్వామి నిన్ను నేను మరవజాలరా; ॥ఓ వాలు॥ ఉంటే ఈ వూళ్ళో ఉండు పోతే పొరుగుదేశం వెళ్ళు సుట్టుపట్టల ఏ మూలనున్న సూడక నా మనస్సుండా దెంకటస్వామి నిన్ను నేను మరవజాలరా; ॥ఓ వాలు॥ ఎర్ర సెరువు వాలుగు ముక్కలు గోలకొండ గుల్ల సింతపండు ఆవాలు ధనియాలు వేసి వండితే ఆ వాసనకీ సుట్టు తిరిగే వెంకటస్వామి నిన్ను నేను మరవజాలరా; ॥ఓ వాలు॥ ఓ అందకాడ నా కోడెకాడ సందెకాడను గోడదూకి తొంగి చూడ గడబిడాయెను నా బంగారు మామ వెంకటస్వామి నిన్ను నేను మరవజాలరా; ॥ఓ వాలు॥ |