| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
172. మొక్కులు
| మొక్కిన మొక్కులు సల్లగుండీ మొగుడి కళ్ళుపోతే - నా మొగుడి కళ్ళుపోతే కట్టమీది ఆ అంకాళ్ళమ్మకు పెట్టకోళ్ళనిస్తూ దండుకుపోయిన యిద్దరు మరుదులు గుండ్లు తగిలి సస్తే - పెద్ద గుండ్లు తగిలి సస్తే సాతులూరి యా పోతురాజుకు మేకపోతునిస్తు సంకన వున్నా చంటిబిడ్డకు సన్ని గొట్టిపోతే - మాయ సన్ని గొట్టి పోతే సత్తెనపిల్లీ గోపాలుడికీ నిత్తె పూజసేతు॥ |
| దీనికి వ్యాఖ్యానము దండుగ. ఉపపతికి సొమ్ము చాలదు. ఉనికి అత్తింటనే సౌఖ్యము, అనుకూల్యత కొఱకు మాత్రమే మొక్కుకుంటున్నది. |