| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (బొమ్మల నోములకు సంబంధించిన పాట) |
| 008. బొమ్మల నోము |
|
కంటి కంటి ఏం కంటి? కిందాన మీది కంటి చల్లమెట్ల గౌరికంటి సావిత్రి గౌరికంటి. చూస్తి చూస్తి దేవీ - దేవరా చూస్తి దేవీ - దేవరా ఏం చేస్తున్నారంటే రత్నాలు జూదం ఆడుతున్నారు. ఎవరు ఓడారు ఎవరు గెల్చారు అందుకు సాక్షులు ఎవరు దేవీ, దేవరా సాక్షి సావిత్రీ గౌరిదేవమ్మ నీ సాక్షి ఎల్లకాలం కావాలి. స్వర్గాని కెళ్ళినా సవతిపోరొద్దు మేడమీదకెళ్ళినా మారుతల్లొద్దు సావిత్రీ గౌరిదేవమ్మ తల్లీ నీ దయమాకు ఎల్లకాలం కావాలి కంటి కంటి ... |