| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (బాలలకోసం పెద్దవారు రచించిన ఈ తరహా జోలలు- ఎన్నో ...) |
| 010. జోల పాట |
|
ఉల్లాయాచీ - చొల్లాయాచీ పొద్దూ పొద్దూ ఒక చాయ పొద్దెక్కీ చాయ పొద్దుపొయె చెల్లమ్మ పొన్న పూచాయ జాము జాము ఒక చాయ జామొక్క చాయ జామూపై చెల్లమ్మ పాజా పూచాయ దాతురా గుంటక్క తలగడక పోతే జల్లు జల్లు మని రాలె జాజి పువ్వూలు నిద్రపో చెల్లమ్మా నీ నిద్రలేలా నిద్ర కన్నెకలొచ్చి నిన్ను లేపెదరు నిద్రకూ వెయ్యేళ్ళు నీకు వెయ్యేళ్ళు నినుగన్న తల్లికీ నిండు నూరేళ్ళు అందరీ మామల్లు చందమామల్లు చెల్లమ్మ మామల్లు రామలక్ష్మణులు చెల్లమ్మ బుద్ధులూ వేణునాదములూ నిండు పున్నమి నాడు చందమామ నిన్ను కోరి పోయాడమ్మ నీ మేనమామ. |