| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (అలక - అంటే అలగడంలాంటిది! పెళ్ళిళ్ళలో అల్లుడుగారి అలకపాన్పు సంగతి పాత విషయమే కదూ? పోతే ససంసారంలో అడుగడుగునా ఈ అలకల అలుగులు నిత్యకృత్యాలే కదా - అలాటిదే ఈ అలకపాట) |
| 017. అలక పాట |
|
పూరింటిలోపలను చాపొకటి పరచుకొని స్వామివచ్చిన వేళచూసి తాను అలిగుండె. చిలుకకూ పలుకులూ చెప్పేది నెరజాణ తలుపులూ మూసుకు సవరించిన కారణమేమో తెలుపుము ... నీ చేతి సురటీలు నాచేతికిచ్చినా సరగునా కోపమూ చల్లన చేసెద సరసిజాక్షి సరగున యియ్యవే ... దండమే ఓ భామ కన్నెత్తిచూడవే కల్కిరో నేరస్తుడనే కవాటమ్ములు మూయకే ... కొత్తా పెళ్ళీకొడకా కొడుకుని ఎత్తవోయి కోరిక తీర్చిపోదామని కోరీ వస్తినే ... |