| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (స్త్రీహృదయం ఎంతవింత అయినదో. నాగుమయ్యకీ బుద్ధులు చెబుతూంది.) |
| 019. నాగు పాట |
|
పుట్తలో నాగన్న బూచి నాగన్న. ఎండలో పడుకోకు వెర్రి నాగన్న. కలవారు యిళ్ళలో గర్వంబు వారు. కాలాపి జల్లేరు కాళ్ళ జల్లేరు. ఎంగిళ్ళు యేసేసి భంగపుస్తారు. అటువెళ్ళి కూకోకు చాకిరేవులకూ. చాకిరేవూలోన చేరి పడుకుంటే సాలిపురుగని నిన్ను సంపేరు వారు. అటు వెళ్లకు నాగన్న చెరుకూతోటలకూ. చెరుకూతోటలోనా చేరీ పడుకూంటే నల్లాచెరుకని నిన్ను నరికేరు వారూ. |