| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పెళ్ళి సమయంలో - పన్నీరు జల్లుతూ పాడేది) |
| 027. పన్నీరు పాట |
|
వెతకీ పన్నీరు జల్లరే శ్రీరాములపై వెతకీ పన్నీరు జల్లరే వేణుగోపాలునిపైని మగువా లందరుగూడి మన సీతారాములపై ... ॥వెతకి॥ సంపెంగ తైలమంటే సఖియా లందరుగూడి సరసముతో వెతకి సఖియ శ్రీరాములపై ... ॥వెతకి॥ కస్తూరి తిలకామూ చక్కాగా కాంతలందరు గూడి కరుణతో వెలసినట్టి కాంతా శ్రీరాములపై ... ॥వెతకి॥ బంగారు శాల్వగప్పరా శ్రీరాములపై బంగారు శాల్వగప్పరే పణతులందారు గూడి భక్తితో వెలసినట్టి భద్రాద్రి శ్రీరాములపై ... ॥వెతకి॥ |