| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 074. దంపు పాట |
|
పిండీ కొట్టామనీ పిండుకోకండి ఇరుగు పొరుగుల్లార ఇది ముగ్గు పిండి సువ్వి - హా - సువ్వి పిండికొట్టి అల్లుడ్ని పిలువ నంపితే రానాని అల్లూడూ రచ్చకొమ్మెక్కే సువ్వి - హా - సువ్వి రానాని అల్లూడూ రచ్చకొమ్మెక్కే పిలువానని వారి మామ పేటాకొమ్మెక్కే సువ్వి - హా - సువ్వి పిలువానని వారి మామ పేటాకొమ్మెక్కే వండానని వారత్త వంటిళ్లు సొరద సువ్వి - హా - సువ్వి |