| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 096. దంపు పాట |
|
సురతాడి మా వొదిన సూదూ లమ్మిందీ సూదూ లమ్మిన గింజ గాదీ కట్టిందీ సువ్వి - హా - సువ్వి వీపరాలు మా వొదిన విందట్టుకొస్తే నల్లేరు నలుగెడుదు కంద నీళ్లోస్తూ సువ్వి - హా - సువ్వి వండినది వొదినా వలపూలతో మాగింది ఒదినా మామిడి పండల్లె సువ్వి - హా - సువ్వి |