| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (దంపు పూలగుత్తిలోదే ఈ దంపు) |
| 104. సువ్వి పాట |
|
సువ్వి గిరి రామలింగ సువ్వి కస్తూరిలింగ సువ్వి యనుచు పాడరమ్మ సురతులందరు అంచు లంచు లరుగు వేసి పంచవన్నె ముగ్గు వేసి పాడిపాడి దంతురమ్మ పణతులందరు ఉల్లిపూవు జల్లెడమున శ్యామపూవు కుందనమున శ్యామపూవు కుందనముకు సెఱుకు రోకిళ్లే దాదూలు దంచేది దూది రోకండ్లేమో మగువలు దంచేది మాని రోకండ్లే చిన్నవడ్లు పెద్దవడ్లు పేరైన రాజనాలు కృష్ణనీలాలు దంచి కీర్తిపొందరే దంచి దంచి కన్యలంతా దాహము కొనినారే ముత్యమంత చెంబుతోన దప్పికందరే మోవలంగి కొప్పులోన మొగలిరేకు లంటబట్టి కులుకులాడి పమిట చెరుగు కుంకమాయెనే అక్కచూడె చుక్కబొట్టు అమరినట్టె యుండి మోహనాంగి కొప్పులోన మల్లె గుత్తులే అంటకుండ వండకుండ వంటచెరకు వేరకుండ అంటుముట్టు లేనిచోట వంటజేయరే భక్తితోను వంటచేసి పళ్లెరమున తీసిమీరు పద్మజాక్షి కొలువ పాట పాడరే. |