| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఏ బీబీనాంచారమ్మనో కలుసుకొని వచ్చాడని అలిగిన అలుగుల మంగమ్మ శ్రీనివాసుడిని ప్రశ్నిస్తూంది - వినండి ఆ సంవాదం) |
| 108. తలుపు దగ్గర పాట |
|
శ్రీకాంతామణి నే నీ సఖుడను శీఘ్రము వాకిలి తీవే నీవు శీఘ్రము వాకిలి తీవే. ఓ కాంతుడ నీగుణములు తెలిసెను ఊరికి వెళ్లగదోయీ నీవు ఊరికె వెళ్లగదోయీ ఈ మాటలు నీవెన్నడాడవది ఏమే అలుమేలుమంగా అది ఏమే అలుమేలు మంగా భామల మరగిన వాడవు నాతో పలుకేల పో - వోయీ - యీ పలుకులేల పోవోయీ పరభామలనే కూడితినని యిటు పలుకుట కారణమేమే సఖి పలుకుట కారణమేమే. తరుణుల కూడక యుంటే పువ్వుల దండలు ఎక్కడివోయీ పూల దండలు ఎక్కడివోయీ. హరిహరి నేనే మెరుగను భక్తులు అర్పించిరె వో చెలియా నా కర్పించిరె ఓ చెలియా. |