ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
విరాధవధ
నరుగుచో నా దండకారణ్య 4భూమి
నురుపర్వతాకారుఁ డుగ్రలోచనుఁడు[వా.రా. సర్గ 2-4]
ఘన5వక్త్రనాసుండు కఠినవిగ్రహుఁడు
ఘనుఁడు విరాధుఁడన్‌ కడిఁది రక్కసుఁడు
6గరుడండు బాలనాగము వేగ నొడిసి
యిరవొందఁగా దివికెగయు చందమునఁ
బటుశూలముఖచంచు భాగుఁడై సీతఁ
గుటిలకుంతల నెత్తికొని మింటి కెగసి
జనకజ7దెసఁజూచి చాలఁ జింతించు
ఘనుల శ్రీరామలక్ష్మణుల నీక్షించి:
‘యోరి!8వీరులవలె నోడక వచ్చి
యీ రసంబున మీర లేనున్నయడవి
శరచాపహస్తులై చరియింప నెంత?
9బిరుదులు! భుజశక్తి పేర్కొన నెంత!
తల్లి 10శతహ్రద; తండ్రి జయుండు;
తొల్లి యాయుధములఁద్రుంగకయుండ
బ్రహ్మచే వరములు పడసినవాఁడ;
బ్రాహ్మణాశనుఁడ; విరాధుఁడన్వాఁడ;
నే నల్గి చూచిన నింద్రాదిసురుల
నైనను మ్రింగుదు నట మర్త్యులెంత?
యీ యింతి నొప్పించి యీ11యెడ వెడలి
పోయి12మీమీ ప్రాణముల గాచికొనుఁడు;
కాదేని నా చేతి ఘనశూలహతికి
నాదట13నఱిమి రం.”డని పేర్చి పలుక
సౌమిత్రి యప్పుడు జనకజభయము
నా మహారాక్షసు నదటును జూచి:
“యోరి! రామునిదేవి నురుపుణ్యసాధ్వి
ధారుణినందనఁ 14దగ దోరి! నీకుఁ
గొనిపోవ; నెక్కడ గొనిపోయె15దింక!
నినుఁబట్టి వధియింతు నేఁడు నా కడిమి.
నని బాణసంధాన మలుకమైఁజేసి
ఘనబాణతతులు వక్షముగాఁడ నేయ
నరుదుగా వాఁడట్టహాసంబుసేసి
కెరలుచు శూలమంకించి వైచుటయు
ఘనఘనాఘనము 16సంగతిఁబాసి పిడుగు
చనుదెంచుకరణి రా జానకీవిభుఁడు
నది రెండుశరముల17నలుకమైఁద్రుంపఁ
బదరివాఁడట సీతఁబడవైచెఁ బుడమి.
నా రాక్షసునిఁబాసి యాకాశవీథి
ధారుణీసుత సీత దల్లడిల్లుచును
జలదంబు నెడఁబాసి చనుదెంచుమెఱపు
చెలువునఁ18జనుదేరఁజెచ్చెరఁ19గదిసి
గరుడాస్త్రమున డించి కడఁగి రాఘవుఁడు
వరబాణములు పెక్కు వానిపై నేయ
నవి లెక్కసేయక యట్టహాసంబు
భువనభయంకరంబుగ బిట్టొనర్చి
కరముల రామలక్ష్మణుల నిద్దఱను
గరమర్థిఁబట్టి రక్కసుఁడుక్కుమీఱి
మూపులనిడి రయంబునఁద్రోవఁబట్టి
20వే పోవ సీతయు వెనువెంటఁదగిలి
వాపోవ నట గొంతవడి పోయిపోయి
ప్రాపిత కోపులై రామలక్ష్మణులు
మెఱుఁగుఁదీగలరీతి మెఱయుఖడ్గంబు
లొఱలూడ్చి వాని బాహులురెండుఁదునుమ
గిరి వజ్రమునఁ గూలుక్రియ దిక్కులద్రువ
నురువడి నొఱలుచు నుర్విపైఁగూలి
యసువులు వీడకయ్యసుర యుండుటయు
నసమానపదముష్టిహతుల నందంద
ముద్దగాఁజేసి సముద్ధతిఁజంపి
‘రద్దిరా!’యని మునులాశ్చర్యమంద.
నతఁడు గంధర్వుఁడై యా రాముఁజూచి
యతులవిమానంబునందుండి పలికె:
“నేను గంధర్వుఁడ; నేను తుంబురుఁడ;
భూనాథ!మును రంభఁబొంది కొల్వునకు
రాని గర్వ మెఱింగి రాక్షసాకృతిగ
నేను గుబేరుచే నిటు శాపమంది
నేఁడు మీ భుజశక్తి నిజశాపముక్తి
పోఁడిగాఁబొందితిఁ; బోయెద నింక;
నిరవొంద నా దేహ21మిలఁబూడ్చి చనుఁడు
శరభంగమౌని యాశ్రమమున.”కనుచుఁ
బోయె మ్రొక్కుచు.నంతఁబొలుపొందువాని
కాయంబు ధరఁబూడ్చికడు22భయంబందు
ధరణీతనూభవఁ దగఁ గౌఁగిలించి
పరమసమ్మదమున భయమెల్లఁబాపి[వా.రా. సర్గ 5]
తలకొన్న పేర్మితోఁ దమ్మునిఁజూచి:
“యిలమీఁదఁగల్గునే యిట్టి దుర్గములు
కావున వేగ మీ గహనంబు దాటి
పోవలె మనము భూపుత్రిఁదోడ్కొనుచు.”

  1. వీథి
  2. వక్ర
  3. అట్టహాసము సేసి యాకసం బద్రువ బెట్టుగా వనమెల్ల భేదిల్ల వచ్చి, గరుడండు…
  4. దశ
  5. మానవులార యోడక
  6. బిరుదులై… ఁబేర్కొన్నవారు(ననాదు)
  7. శత(తా)హ్లాద…
  8. కానవిడిచి
  9. మీదగు
  10. ఁబేర్చిరండని పల్కఁదడవ
  11. దగురోరి
  12. దీవు
  13. సంగడి
  14. నలవు
  15. బఱతేర
  16. జూచి
  17. సాపుగా నడచుట జనకజగాంచి
  18. మిట
  19. సంతసిల్లి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )