ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
మారీచ మాయామృగము
నా యెడ మారీచుఁడరదంబు డిగ్గి
యా యసురాధిపుఁడపుడు ప్రార్థింప[వా.రా. సర్గ 42]
మాయావిగాన యమానుషమహిమ
మాయామృగాకృతి మది విచారించి
మేలైన కనకంబు మేనును నింద్ర
నీల నీలాయతనేత్రయుగ్మంబుఁ
బవడంపుబొమలును భాసిల్లువజ్ర
నివహకర్ణములు నీలవాలంబుఁ
బొలుచుపచ్చలశృంగములు ముత్తియముల
తొలకులు రత్నబిందువులైనపొడలు
రాజిల్లు నవపద్మ రాగోదరంబు
రాజతఖురములు రమ్యమై మెఱయ
జగతిపై రోహణాచల మొప్పుమిగుల
మృగరూపమున వచ్చి మెలఁగుచున్నదియొ;
ఒండేని రాహువు కులికి రాకేందు
మండలమృగ ముర్వి మలయుచున్నదియొ;
కాదేని రాక్షస క్షయము గావింప
నాదటఁజింతించి యబ్జసంభవుఁడు
మెఱుఁగులెల్లను గూర్చి మృగముఁగావించి
కఱటియై పుత్తేరఁగా వచ్చినదియొ?
జానకి నెఱివేణి శక్రనీలముల
నా నాతిదంతంబు లాణిముత్తెముల
భామినికెమ్మోవి పవడంపులతలఁ
గామిని చెక్కులు కళుకువజ్రముల
వైదేహితనుకాంతి వైడూర్యమణుల
నా దేవినూఁగారు హరిరత్నముల
భామ పాణిద్యుతుల్‌ పద్మరాగములఁ
గోమలి నఖకాంతి గోమేధికములఁ
బటుతేజమునఁజాలఁబరి 215హసించుటయు
నటులఁగీడ్పడి వచ్చి యఖిలరత్నములు
రత్నగర్భాత్మజారత్నంబు నలఁప
యత్నంబుతో మృగమై వచ్చినవియొ?
“సీతకై తనవిల్లు సేకొని విఱిచె;
నీ తఱి రఘురాము నెలయింతు.”ననుచు
హరుఁడు పుత్తేరఁగా నాతనిచేతి
హరిణమిచ్చోటికి నరుదెంచినదియొ?
సీతమోమున కోడి సీత భ్రమింప
శీతాంశుఁడనుప వచ్చిన మాయలేడొ?
యనఁ జిత్రవర్ణంబులైన దీధితులు
పెనఁగొని యొండొండ పేర్చి శోభిల్లఁ
గపటసారంగమై216కదియ నేతెంచి
యుపమింప నరుదైన యొప్పుల 217నొప్పి
218నెమకుచుఁబులుమేయు; నిజవాలరుచుల
రమణమై వనమయూరముల నాడించుఁ
219దఱమిడి యొకమాఱు తన220దేహరుచులఁ
బఱపైన వనమెల్లఁబసిఁడి గావించుఁ
గుదియించి యొకమాఱు కుప్పించిదాటి
త్రిదశేంద్రుచాపంబు తెఱఁగు గావించు;
నొకమాఱు చెంగున నుప్పరంబెగసి
ప్రకటించు నతులశంపాలతా 221తతులఁ
దఱిగొని యొకమాఱు తనపార్శ్వరుచుల
నెఱిఁజంద్రకాంతముల్‌ నీరుగావించు;
మృగయూధములఁగూడి మెలఁగి పుల్‌మేయు
మృగముల బెదరించు; మెల్లనడాగు;
నంతంతఁబొడసూపు; నట చేరవచ్చు;
నంతలో బెదరి 222బిట్టడరి కుప్పించుఁ
దరులనీడల కేఁగుఁ;దగఁబర్ణశాలఁ
జొరఁబాఱు;నంతంత స్రుక్కి క్రేళ్లుఱుకు;
వసుధ మూర్కొని చూచు; వాలమల్లార్చు
దెసలకుఁజెవిసేర్చి తెలియనాలించు;
గంచుమించై పాఱుఁ; గ్రమ్మఱఁజేరుఁ;
గుంచితాకృతిఁజెవికొనఁగదలించుఁ;
బచ్చికపట్లపైఁబవళించు లేచు;
మచ్చిక నచ్చోటిమౌనులఁ జేరు;
ఖురములఁజెవి గ్రోఁకుఁ; గొమ్ములతుదల
విరులతీగఁగదల్చి విరులెల్ల రాల్చు;
నందంద యందమై యా పర్ణశాల
ముందఱ మృగమిట్లు మోదించి మెలఁగ
నా వేళ సీతయు నలరులఁజిదుమ
లావణ్యసీమ యల్లనఁ బర్ణశాల[వా.రా. సర్గ 43]
మంజుల శింజానమంజీరరవము
రంజిల్ల వెడలి 223సౌరభములఁబొదలు
పొదలు డాయుచు విరుల్‌ పొసఁగఁ గోయుచును
మదికి విస్మయమైన మాయంపులేడిఁ
గనుఁగొని వైదేహి కడుఁజోద్యమంది
యినకులాధీశున కిట్లని పలికె:
“నీ పొంత వింతయై యిది యొక్క మృగము
భూపాల!చూచితే224పొలయుచున్నదియు.
నెన్నఁడుబొడగాన మిన్నిచందముల
వన్నెలమృగముల వనభూములందు.
జగతీశ! యీ మృగచర్మంబునందుఁ
దగిలి సుఖింప నెంతయు వేడుకయ్యె.
దిననాథకులనాథ! దీని వెన్‌ తగిలి
చని యేసి వెసఁ225జింపి చర్మంబు దెమ్ము.
అదియేల? యే యుపాయంబు226న దీనిఁ
227జెదరక పట్టి 228తెచ్చెదవేని మిగుల
మంచిది ప్రాణేశ! మన వనవాస
మెంచఁగ నీడేరె; నీ పైఁడిమృగముఁ
బురికి వేడుకఁగొనిపోయి యత్తలకు
భరతాదులకు వేడ్కపఱుపంగవచ్చు.”
నని సీత ప్రీతిమై నాడు వాక్యములు
విని లక్ష్మణుఁడు రామవిభుఁజూచి పలికె:
“మృగరాజునకు నిట్టిమేను లే దుర్వి;
మృగమాత్రమున కిట్టి మే నెందుఁగలదు?
మాయామృగంబిది; మది నమ్మవలదు;
మాయావు లసురుల మాయ గానోపు.
నదియుఁగాకిచటిసంయములు“మారీచు
డదయుఁడై మాయావియై యిందు మెలఁగు.”
నని పల్క వినవె? యా యసుర గానోపు
మనల భ్రమింప నీ మాడ్కి నేతెంచెఁ.
జిత్తంబు దీనిపైఁజిక్కించి 229మీర
లుత్తలపడి 230పట్ట నూహింపవలవ.
దా రయ వైదేహి యతిముగ్ధ231యైన
మీరును ముగ్ధలే మేదినీనాథ!”
యనిన రాముఁడు సీతయాననాంబుజముఁ
గనుఁగొని నవ్వి లక్ష్మణుఁజూచి పలికెఁ
“జలియింప నేటికి సౌమిత్రి! యింత?
యిల రాక్షసులమాయ లెదురునే నన్ను?
మృగమేనిఁగొనివత్తు; మేటిరక్కసులఁ
దెగనేసి పొలివుత్తుఁ; దెలిసి యీరెండుఁ
దెంపుమై లక్ష్మణ, దీని వెన్‌తగిలి
చంపి చర్మముఁదెచ్చి జనకజ కిత్తు;
నిన్నినాళ్లకు సెలవీ కోర్కి వేఁడఁ
జిన్నవుత్తునె? సీతచెప్పిన చేఁత!
హితమతివై పూని యీ పర్ణశాల
నతివ నేమఱకుండు.” మని యప్పగించి

  1. కడఁకతో వచ్చి
  2. న నిలిచి
  3. నెమరుచు
  4. దఱిగొని
  5. పార్శ్వ, మేని
  6. రుచుల
  7. బిట్టదరి
  8. సంరంభంబు పొదలి
  9. పొదలు
  10. జంపి
  11. లనీవు
  12. వదలక … తేవలతేని
  13. చెచ్చెరఁదెచ్చితేని
  14. దీను
  15. చంప
  16. గాక
  17. డనుజుని చేతి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )