ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
సీతాపహరణము
నత్తఱి రావణుం252డతిసంభ్రమమున
నుత్తలంబునఁజిత్త 253ముడుకుచునుండఁ[వా.రా. సర్గ 46]
గరమున దండంబు ఘనకమండలము
నురులలాటంబున నూర్ధ్వపుండ్రంబుఁ
గొలఁదులౌవ్రేళ్లను గుశపవిత్రములుఁ
బొలుపొందు పేరురంబున జందియములు
నరుదుగా వలచేత నక్షమాలికయు
సరిఁబూనియున్న కాషాయవస్త్రములుఁ
దులసిపూసలపేర్లతోడ ముందఱికి
వలనొప్ప నొకకొంత వ్రాలినమెడయు
బడుగుదేహంబును బావలుఁజింపి
గొడుగున వెడ ముడిగొన్నట్టిశిఖయు
నలవడఁగపటసన్న్యాసివేషంబు
విలసిల్ల వెడవెడ వ్రేళ్లెన్నికొనుచుఁ
గొన్నిమంత్రంబులు గొణుఁగుచు మునులు
ద న్నెఱుంగుదురని తత్తఱింపుచును
దలకొన్న ముదిమిచేఁదల వడఁకంగ
నలయుచు సొలయుచు నరసిచూచుచును
నంతంత నిలుచుచు“హరిహరీ!”యనుచు
శ్రాంతిఁబొందుచుఁబర్ణ254శాలకు వచ్చి
తనుఁజూచి“వనదేవతలు జగద్ద్రోహి
చనుదెంచె వీఁ.”డని సభయులై యొదుఁగ
నిక్కంపు255మునివోలె నిలిచినఁజూచి
గ్రక్కన వైదేహి గడుభక్తి256మెఱసి
యక్కపటాత్ము సంయమిగాఁగఁ దలఁచి
మ్రొక్కి హస్తాంబుజంబులు ముకుళించి
పొలఁతి యభ్యాగతపూజ 257గావింపఁ
గలఁగుచుఁ258గైకొని కమలాక్షి కనియె:
‘నో భామ! నీ విట్టియుగ్రదుర్గముల
నే భంగిఁజరియించె దిట్లొంటి నిలచి?
రతివొ; శ్రీసతివొ; భారతివొ; కాకున్న
క్షితి మర్త్యసతులకీ చెలువంబు గలదె?
నీ మోము259పండువెన్నెలపిండుఁదెగడు
నీ మోవి కెంపుఱానిగ్గులఁదెగడు;
నీ మేను సౌదామనీలతఁ గేరు;
నీ మాట సుధ తేటనీటుల మీఱు;
నీ వేణి జలధరనికరంబుఁదఱుము;
నీ విలాసంబు వర్ణింప నా తరమె?
తరుణి! నీ కౌఁగిటఁ దవిలి సుఖించు
పురుషుఁడు తలపోయఁబురుషోత్తముండు.
కామిని నీ పొందుగలవాఁడె పూర్ణ
కాముఁ;డాతఁడు నిత్యకల్యాణుఁడరయ.
నిచ్చట నీ యున్కి కెంతయు 260 వగపు
నచ్చెరు వయ్యెడు నబ్జాక్షి! 261మాకు
నెలఁత! నీవెవ్వరు?262నీ వేలయింత
నలిఁగెద విక్కాననమ్మునఁ జిక్కి
యంతయు నెఱిఁగింపు.”మనుటయు సీత
యెంతయు భక్తితో నేర్పడఁ బలికె:
ననఘాత్మ! రఘురామునతివ; మాతండ్రి
జనకుండు; మామ దశరథేశ్వరుండు;
నాపేరు సీత; యున్నతకీర్తి రామ
భూపతి తమతండ్రి పొమ్మన్న వెడల
కాననంబుల నుండఁగడఁగి వచ్చుటయు
నేనును లక్ష్మణుండేఁగుఁదెంచితిమి.
ఈ యాశ్రమంబున నేము మువ్వురముఁ
బాయని నియతిఁదాపసులమై యుండ
నొలసి మా ముందఱ నొకపైఁడిమృగము
పొలయుటయును నేను భూనాథుఁజూచి
దాని263నేగతినైనఁ దగిలి తెమ్మనినఁ
బూని రాముఁడు వోయెఁ.బోయినవెనుక
“హాలక్ష్మణా!”యను నార్తరావంబు
శూలమై నా చెవిసొచ్చి కాఁడుటయుఁ
బొగిలి లక్ష్మణు నేను బొమ్మన్నఁబోయె;
మగుడిరాఁ;డిదియేమిమాయయో యెఱుఁగ.”
ననిచెప్పి మునిఁజూచి:“యనఘ!నీపేరు
వినుపింపు మిట కేల,విచ్చేసి?”తనుడుఁ.
గొంకక తనదైన కుహకత్వ ముడిగి
లంకాధినాథుఁ డాలలన కిట్లనియె:
“వనజాక్షి! విను, మేను వనధిమధ్యమున
నెనయ లంకాపురంబేలెడివాఁడ;
రాక్షసాధిపుఁడ; విశ్రవసునందనుఁడ;
యక్షేశుననుజుండ; నఖిలదిగ్జయుఁడ;
రావణుండనువాఁడ; రణమున నెదిరి
దేవాసురులనైనఁ దెగటార్చువాఁడ;
వనిత! నీ రూపలావణ్యసంపదలు
విని చూడవచ్చితి వేడ్క లుప్పొంగ.
నవయుచుఁ బేదమానవునితోఁగూడి
యువిద! యీ యడవుల నుండనేమిటికి?
నా రాజ్యమంతయు నలినాయతాక్షి!
కోరి యేలుచు నీవు కొమరు దీపింపఁ
బొగడొందుపెంపునఁ బుష్పకంబాది
యగు విమానములందు హర్మ్యంబులందు
సుర గరుడోరగాసుర సిద్ధ సాధ్య
వరకన్యకలు గొల్వ వర్తింతుగాక!
నీ యంఘ్రిరుచులు నా నిలయభూములకు
మాయని మణికుట్టిమములగుఁగాక!
చెలువ! నీ చూపులసిరులు నా మేడ
కలువతోరణముతోఁగలహించుఁగాక!
నీ మందహాసంబు నిత్యంబునాదు
ప్రేమాంబునిధికిఁజంద్రిక యగుఁగాక!
రమ్ము నా లంకాపురమ్మున.”కనిన
264నమ్మాట విని సీత యతిభీత యగుచు
ధీర గావున వానిఁదృణముగాఁజూచు
తీరునఁ దన చేతితృణముఁజూచుచును265
“సారపతివ్రతాచారగా యనక
యోరి! నన్నిట్లాడ నుచితమే నీకు?
ననిమిషయోగ్యపూర్ణాహుతి శునక
మునకు దుర్లభమైనపోల్కి భావింప
శ్రీరామచంద్రునిఁ జెందిననన్నుఁ
గోరి కామింప నీకును నెన్నితలలు?
పొమ్ము గుట్టున నీదుపురవరంబునకు;
నెమ్మదిఁ బోక దుర్నీతి యే మేనిఁ
దలఁచితివేని, నా ధవుఁడు రాఘవుఁడు
విలసితశస్త్రాస్త్ర విదితలాఘవుఁడు
హరచండకోదండ హరణవినోది
ఖరదూషణాది రాక్షసశిరశ్ఛేది
నిన్ను నీ వంశంబు నీఱు గావించు.
నెన్నంగ నీకు నా యినకులాగ్రణికి
నక్కకు సింహంబునకును, దోమకును
దిక్కరికిని, బయోధికిఁగాలువకును,
వాయసంబునకును వైనతేయునకు,
నే యంతరువు పెద్దలేర్పఱింపుదురు;
ఆ యంతరువు గల దటుగాన నీవు.
ధీయుక్తి లంకకుఁదిరిగిపొమ్మింక.”
ననవుడు రావణుం డాగ్రహోదగ్ర
జనితోగ్రదృష్టిమై జానకిఁ జూచి[వా.రా. సర్గ 49]
యనుపమాటోపుఁడై యా రూపముడిగి
తనమనోవీథిఁ గందర్పాగ్నిమండఁ
బదియవస్థలు దోచి భాసిల్లుపగిదిఁ
బదితలల్‌ మణిజూటపంక్తుల నొప్ప,
నా యవస్థలఁగోర్కులవి యిన్మడింపఁ
బాయనిగతి నొప్ప బాహు లిర్వదియుఁ
గొన లిన్మడింపఁగోర్కులు పల్లవించె.
నన రక్తరుచులైన హస్తంబు లొప్ప,
లలిఁదోచు కోర్కిపల్లవములఁ బుష్ప
ములువోలె నాయుధంబులు పొల్పుమిగులఁ
బరగ దివ్యాంబరాభరణైక కాంతు
లరుదార మదనాగ్నులై మండుచుండ
నతిభీకరాకారుఁడై నిల్చుటయును
ధృతి దూలి సీత భీతిల్లి మూర్ఛిల్లె.
వడగాలిఁ బడియున్న వనలతవోలెఁ
బడియున్నఁగనుఁగొని పంక్తికంధరుఁడు
గ్రమ్మియశ్రువులొల్కఁగౌఁదీగ266యుల్కఁ
గ్రుమ్ముడి 267బిగియూడఁ, గుచములల్లాడ
నందంద దెగి రాల హారరత్నములు,
పొందినభయశోకముల మేను వడఁక,
నచ్చారులోచన నదయత నెత్తి
తెచ్చి రథంబుపైఁదెఱఁగొప్పఁబెట్టి.
దైవంబు ప్రేరేపఁ దనపాలిమృత్యుఁ
దేవత గొనిపోవు తెఱఁగు 268నఁ బేర్చి,
యమరారి గొనిపోవ నాకాశవీథిఁ
గమలలోచన దేఱి కనువిచ్చి చూచి
పెదవులు దడుపుచు బిగిచన్నుదోయిఁ
బ్రిదిలినపయ్యెద బిగియఁజేర్పుచును269
ఎలుఁగెత్తి 270కొదమకోయిల 271గ్రోల్చినట్లు
పలుమాఱు విధి దూఱి ప్రాణేశుఁజీఱి
యలఁతయుఁగోపంబు నతివిషాదంబు
వెల 272వెలపాటునై విలపింపఁదొణఁగె:
“నో రాఘవేశ్వర! యోరామచంద్ర!
నీరజహితవంశ! నీ దేవి, నన్ను
ననదచందంబున నక్కటా! నేఁడు
కొనిపోవుచున్నాఁడు కుటిలరాక్షసుఁడు;
వేవేగ చనుదెంచి వీని 273మర్దించి
కావవే నా లజ్జఁ; గావవే నన్ను.”274
“నేలరా, రాక్షస, యీ నింద నీకు?
నీ లంక నేలరా, నీవె 275 కాల్చెదవు?
తగదురా నీకు నీ దారుణక్రమము.
తెగటార్చురా, నిన్నుఁదివిఱి రాఘవుఁడు.”
“కనకమృగంబేల కనుఁగొంటి నొంటి?
నినవంశవల్లభు నేల పొమ్మంటిఁ
గాదన్న పలుకేల కైకొననైతి
మేదినీవిభుఁడేల మృగముఁదేఁబోయె?
జగతీశులా వేల చర్చింపనైతిఁ?
బొగిలి లక్ష్మణునేల పొమ్మంటిఁదిట్టి?
యీ పల్కులేమిటి? కిటు సేయకున్న
నా పాలివిధి యేల నన్నుఁబోనిచ్చు?”
“నన్న, లక్ష్మణ!నిన్ను నభిమానధన్యుఁ!
గన్నతల్లిగ నన్నుఁగరమర్థి నెన్ను
నున్నతగుణమాన్యు, నుదితసౌజన్యు
నన్నిచందముల నే నాడినఫలముఁ
గుడిచితిఁజేసేతఁ; గోపంబు దక్కి
కడువేగమున వచ్చి కావవే నన్ను.”
“నక్కటా! కైక! నీ వడిగినవరము
లిక్కడఁజేకూడెనే? యిటమీఁద
నీ కుమారుండును నీవును గూడి
యేకాతపత్ర మీ యిలయెల్ల నేలు.”
మని రామవిభుఁజీఱి యసురేశుదూఱి
తనచేఁతఁదెగడి యా దైవంబుఁబొగడి
కాకుత్స్థతిలకు లక్ష్మణుఁగొనియాడి
కైకఁబోనాడి శోకంబున మఱియు:
“మిథిలేశుకూఁతుర! మేదినిఁబంక్తి
రథునకుఁగోడల, రామునిదేవి,
వలఁతులై కావనెవ్వరు లేనిచోటఁ
బొలదిండి సెఱగొని పోవుచున్నాఁడు;
తరులార! నా సహోదరులార! మీరు
ధరణీశునకు నిది దగఁజెప్పరయ్య!”
“సురలార! మీరైన సురవైరిఁదాఁకి
వెరవొప్ప నా చెఱ విడిపింపరయ్య!”
“నిండినభక్తితో ని న్నాశ్రయించి
యుండుదు ననుఁగావ నుచిత మీవేళ;
దగిలి నీవైన గోదావరీదేవి!
276జగతీశునకుఁజెప్పఁజనుఁజెప్పవమ్మ”
“బ్రల్లదుచే277ది లోఁబడి చిక్కువడితిఁ
దల్లి! నీవైనను దయఁజూడవలదె?
భూదేవి! రఘురామభూపాలమణికి
నీ దురవస్థ పెంపెఱిఁగింపవమ్మ!
“వీరువారనక యీ విధమునఁజీఱి
నోరెండె; ధృతి దూలె: నొచ్చెఁబ్రాణములు;
ననుఁగావరయ్య, కిన్నరులార! పుణ్య
ధనులార! ఘనులార! తాపసులార!
కృతులార! హితులార! ఖేచరులార!
వ్రతులార! యతులార! వనజాక్షులార!
కరులార! హరులార! గంధర్వులార!
నరులార! గిరులార! నాగేంద్రులార!”
యనిపెక్కు తెఱఁగుల నమ్మహీతనయ
పొనుపడి శోకింప భూదేవి వడఁకె;
గౌతమి పాఱక గ్రక్కన నిలిచె;
నా తఱి సకలభూతాక్రోశ మెసగె;
“నన్యాయమన్యాయ!”మని మునుల్‌ కపట
సన్న్యాసి రావణుచందంబుఁదెలిసి
పొగిలిరి శోకాశ్రు278పూరంబు లొలుక.
మృగములు నిలుచుండె మేఁతలుమఱచి;
పక్షులు వాపోయెఁబవనంబు లణఁగె;
వృక్షముల్‌ వాడె; నా విలమయ్యె నభము
దిక్కులు వగిలెను దినమణి నొగిలె;
“దిక్కేది?”యని ధర్మదేవత పొగిలె;
వనదేవతలు సాల వగచిరి; సాధు
జనులెల్ల నేడ్చిరి జానకిఁజూచి.

  1. ములుకుచు
  2. శాలాంతరమున
  3. యతి
  4. లేచి, వచ్చి
  5. గావించి - క
  6. నట్లున్నఁగల్యాణిఁజూచి
  7. నిండు… నిగ్గుఁ
  8. మాకు
  9. యిపుడు
  10. వింతయేల?
  11. చర్మము నాకుఁదగిలి
  12. నమ్మానవతి సీత
  13. ఆ నాతి శ్రీరాము నాత్మలోఁదలఁచి - దానవుఁజూడక తరుణి యిట్లనియె, సార…
  14. నులియ
  15. వీడంగఁ
  16. దీపింప
  17. వేడ్కఁజకోరముల్‌ వెన్నెల గ్రక్కు - మాడ్కిఁదమ్ముల జారుమకరంద మనఁగ, నాననశశిఁ దోచునమృతబిందువుల - పూనిక కన్నీరు పొటపొటఁదొరుగ, నెలుఁగెత్తి…
  18. తొగరుఁగో
  19. గూసి
  20. వెల్లఁబాటు
  21. భంజించి, నిర్జించి
  22. ననిపిల్చుచును మగ్గలంబైనఁ - శోక గనలుచు సీత యాకఠినాత్ముకనియె
  23. మ్రింగెదవు
  24. జగతీశ్వరునితోడఁజని తెల్పవమ్మ!
  25. ఁజెఱఁబడి
  26. పూరముల్‌ దొరుగ
  27. ఁగాదేని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )