ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
జటాయు మరణము
నంత నా తెరువున కనతిదూరమున
నంతంత రాక్షసునడుగులచొప్పు,
రాలినయెఱకలు, రక్తపంకమునఁ
గూలిన సూతుపైఁగూలిన తేరుఁ,[వా.రా. సర్గ 67]
దేరుక్రిందటఁబడి తెగినయశ్వములు
ధారుణిఁబడిన పతాకఖండములు,
విఱిగి ముందట నున్న వింటితున్కలును
నఱిముఱిఁబడియున్న యస్త్రశస్త్రములు
గని లక్ష్మణుఁడు సూపఁగడుఁజోద్యమంది
“ఘనులెవ్వరో యిందుఁగదనసౌఖ్యంబు
ననుభవించినవార.” లని యవ్విధంబుఁ
గనుఁగొనుతలఁపునఁగాకుత్స్థకులుఁడు
తెరు వంతకంత శోధించుచు ముంద
ఱరుగుచో రఘురాముఁడా సమీపమున
నెలమియంతయుఁదూలి యెఱకలు దునిసి
కలయ నెత్తుటఁదోఁగి కాళ్లును విఱిగి
పవిచేతఁగూలిన భర్మాద్రి పగిది
వివశుఁడై పడియున్న విహగేంద్రుఁజూచి:
“సౌమిత్రి! చూచితే చపలరాక్షసుఁడు
భూమిజ మ్రింగి తాఁబొడసూప వెఱచి
చలియించి పక్షివేషమున నున్నాఁడు.
పెలుకుఱ వీనిఁజంపెద.” నంచు నలిగి
ఘనచాపహస్తుఁడై కదిసిన రాముఁ
గని పక్షివిభుఁడు గద్గదకంఠుఁడగుచు
నెత్తురు గ్రక్కుచు నిట్టూర్పు లెసగఁ
గుత్తుకఁబ్రాణముల్‌ గుది373యంగఁబలికె.
“ధరణీశ!‘యేను మీ తండ్రికి సఖుఁడ;
బరగంగఁగశ్యపబ్రహ్మపౌత్రుఁడను;
అరుణనందనుఁడ, జటాయు వన్‌వాఁడఁ
జరియింతు నడవుల శైలశృంగముల;’
నని నాదు వృత్తాంతమంతయు నీకు
వినుపింప నే మున్ను విశదంబుగాఁగ.
‘నట్టివానికి నిట్టియాపద యెట్లు
వుట్టె? నటన్న నో పుణ్యాత్మ! వినుము:
వలనొప్ప నేఁడు రావణుఁడు 374వైదేహి
నెలమి మ్రుచ్చిలికొని యేఁగుచో నేనుఁ
బోనీక యడ్డమై భూరిసత్త్వమున
వానితోఁబోరాడి వసుధఁగూలితిని.
అదె వాని కేతుసూతాశ్వసమేత
విదితరథం బాజి విఱిగె నా చేతఁ.
జలము375న నుడువీథిఁ జపలరాక్షసుడు
నెలఁతుకఁగొనిపోయె; నీవు రావైతి.
వేను నీ కీవార్త యెఱిఁగింపఁగంటిఁ
బూని నీ శుభమూర్తిఁబొడఁగానఁగంటి
నతిపుణ్యకృతి నైతి.” నని విన్నవింప
మతిలోన శోక మిన్మడిగ రాఘవుఁడు
విల్లటు పడవైచి వివశుఁడై ధరణిఁ
ద్రెళ్లి సౌమిత్రి బోధింపఁగాఁదెలిసి
“యయ్యో! మహాత్మ! జటాయువా!నీకు
నియ్యవస్థలు వచ్చెనే మదర్థముగ.”
నని జటాయువు దేహ మందంద తడవి
తను రక్తమంతయుఁదానె పోఁదుడిచి
తమ్మునిఁజూచి “యీతఁడు మనకొఱకు
నిమ్మాడ్కి రావణు నెదిరి పోరాడె.[వా.రా. సర్గ 68]
నిటువంటిపుణ్మాత్ముఁడెందైనఁగలఁడె?
యటుగాన దివి కితఁడరుగకమున్నె
రావణుఁడేలెడి రాజధానికిని
ద్రోవయు, వాని బంధురపరాక్రమము
నన్నియు నడుగు మీ.”వన్న లక్ష్మణుఁడు
గ్రన్నను రఘురామకార్యసహాయు
నా జటాయువు నిర్జరాదివిధేయు
నోజఁదద్విధమెల్ల నుచితోక్తి నడుగఁ
గొన్నిమాటలు పేరుకొనుచుఁ గుత్తుకను
గ్రొన్నెత్తు రొల్కఁ బల్కుల కెడలేక
యతులపుణ్యోదయుండగురాముఁజూచి
మతిలోన నతని 376నామంబు నేమఱక
మోక్ష377పదానందమునఁబులకించి
పక్షివల్లభుఁడంతఁబ్రాణముల్‌ విడిచె.
ధరణీశసుతు లంత దశరథాధీశు
మరణంబుకంటెను378మదిఁజాల వగచి
విహగవల్లభునకు వేదోక్తయుక్తి
దహనాదికృత్యముల్‌ దగ నాచరించి
యంత 379వేవేగక్రౌంచారణ్యమునకు
నెంతయుఁగడఁకతో నేఁగి యచ్చోట[వా.రా. సర్గ 69]
నానాలతావృక్ష నగ మృగోదగ్ర
మైనట్టి యొకకోన 380యం దేఁగుచోట
నెఱసినకురులును నిడుదకోఱలును
బఱపైన కడుపును బడ381బాకినోరు
మిడిగ్రుడ్లకన్నులు మీఁగాళ్లదాఁక
విడివడ్డ చన్నులు వెఱ్ఱిచిన్నెలును382
నలర నయోముఖి యనుదైత్యవనిత
కలితసౌందర్య383లక్షణుని లక్ష్మణునిఁ
గనుఁగొని కామించి కరమంటఁబట్టి
“తనుఁబొంద ర”మ్మని తరితీపు సేయఁ
జుప్పనాతికి నెట్టిసుఖ మిచ్చె దాని
కప్పాటు నసిధార ననువార నొసగి

  1. నీ దేవి
  2. సత్త్వము నొప్పఁ
  3. సంస్మరణమే
  4. సదా
  5. బల్మఱు శోకమంది
  6. ఁగ్రౌంచావటమను నాశ్రమమున - కెం
  7. నరుగుచో నచట
  8. బొక్కి
  9. కుదియ గట్టిన మెడ గొప్ప పిక్కలును - మొదలంట బలిసిన మొద్దు పెందొడలు, నలర…
  10. విగ్రహుని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )