| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
రాక్షసపతి యంత రణబలోదారు నిక్షుచాపాకారు నిద్ధవిచారు నక్షీణదోస్సారు నసహాయశూరు నక్షకుమారు మహావీరుఁబిలిచి: “యలవుమై నా క్రోఁతి ననిలోనఁజంపి తలగోసి తోరణస్తంభంబునందుఁ గట్టిర.”మ్మనవుడుఁగడఁకతో నపుడు నెట్టన శస్త్రాస్త్రనిచయంబుతోడఁ దురగాష్టకముతోడ ద్రుతగతితోడ బిరుదుటెక్కెముతోడఁ బృథుకాంతితోడ నుదయార్కనిభమైన యొక రథంబెక్కి కదలి భూభాగంబు గంపింప నడచె నరదంబు మ్రోఁతయు హయహేషితములుఁ గరి బృంహితములు రక్కసులయార్పులును దన మహాకార్ముకధ్వనియు నొండొండ ఘనములై యాశావకాశముల్ నిండఁ. దోరణారూఢుఁడై తొలఁగక చెలఁగు మారుతి నక్షకుమారుండు దాఁకి త్రిజగముల్ భీతిల్ల దిశలు ఘూర్ణిల్ల భుజశక్తి పుంఖానుపుంఖంబుగాఁగ ఘనబాణతతుల నక్కజముగాఁబొదువ: “నని వీని మది బాలుఁడని యెంచరాదు; ఘనపరాక్రమ164మహాఖని వీఁ.”డటంచు హనుమంతుఁడచలుఁడై యా బాణతతుల వాలముఖంబున వడిఁద్రుంచి వైవ మేలని హనుమంతు మెచ్చుచువాఁడు బాణత్రయంబునఁ బావనిశిరము శోణితంబులు గాఱ సూటి నేయుటయుఁ గీలాల165ధారలు కిరణముల్ గాఁగ బాలభానుఁడువోలెఁబరగఁ జూపట్టి యాలోనఁబ్రళయకాలాగ్నియై మండి తాలవృక్షమున రథ్యములు ద్రుంచుటయు నేలఁబదాతియై నిలిచి వాఁడతని ఫాలంబు శరములఁబదియింట నొంప నవశుఁడై తెప్పిఱి యతఁడు వాలమునఁ దవి166లి యయ్యక్షుని తనువు నొప్పింప నక్షుండు గదగొని యనిలతనూజు వక్షంబు వ్రేసిన వడిఁదూలి తెలిసి కుదిసి యగ్గదఁబుచ్చుకొని బిట్టువ్రేయ బెదరి వాఁడొకవింటిపెట్టోసరించి తప్పించుకొని వియత్తలమున కెగసె నప్పుడు 167పలకయు నడిదంబుఁగొనుచు. నలవుమై నంతలో నా వాయుసుతుఁడు తొలఁగక యా దైత్యుతోడనె యెగసి గద వ్రేయుటయుఁజూచి ఖడ్గమంకించి గద రెండుతునుకలుగా వ్రేసి డాసి తొడలు వ్రేయుటయు వాతూలనందనుఁడు పుడమిపైఁబడి నభంబునకు బిట్టెగసి ఖగనాథుఁడురగంబుఁగబళించునట్టు లొగి వాని చరణంబు లొడిసి రాఁదిగిచి తెగువఁగుమ్మరిసారెతీరునఁద్రిప్పి జగతిపై వ్రేసిన జవమెల్లఁదూలి పొలుపఱి తలనున్న బొమిడిక మూడి కలభూషణము లుర్విఁగనుకనిఁజెదర గుండియల్ వగిలి ప్రేగులు వాతఁదొట్టి కండలెల్లెడ రాలఁగనుగ్రుడ్లు సెదర నగలి యద్దానవుఁడంగంబులెల్లఁ బగిలి నెత్తురు గ్రక్కి ప్రాణముల్ విడిచె. వాని చావటు చూచి వాసవాద్యమరు లానందభరితాత్ములై తన్నుఁబొగడ నంత నా హనుమంతుఁడసమానవిజయ వంతుఁడై యార్చి దుర్వారుఁడై యుండెఁ. జెదరినదనుజు లచ్చెరువుగాఁబఱచి త్రిదశారిసభ సొచ్చి దీనులై నిలిచి: “బలియుఁ డా వానరపతి బాహుబలము దలఁప నచ్చెరు168వెందు దానవాధీశ! పొలిసిరి వనపాలపుంగవుల్;గింక రులు గీటడంగి రారూఢవిక్రములు; శతజిహ్వుఁడిలఁగూలె; శార్దూలముఖుఁడు గతజీవుఁడయ్యెఁ; బింగళనేత్రుఁడీల్గె; స్తనిత 169హాసుఁడు సచ్చె; శార్దూలకబళుఁ డనిఁద్రుంగె;మృతుఁడయ్యె నట జంబుమాలి; సోమించి వక్రనాసుఁడు మ్రగ్గె; రక్త రోముండు లయమయ్యె; రుధిరాక్షుఁడడఁగె; దళములతో శూలదంష్ట్రుఁడు మడిసెఁ; జెలువేది మఱి దీర్ఘజిహ్వుండు దెగియె; రూపఱిపోయె దుర్ముఖుఁడు; దుర్ధరుఁడు ప్రాపించె మరణంబుఁ,బ్రఘసుఁడు వడియె; నుఱుమయ్యె భాసకర్ణుండు; యూపాక్షుఁ డొఱగె; విరూపాక్షుఁడుసుఱుతోఁబాసె; నక్షుండు దెగటాఱె; హతుఁడయ్యె నశ్మ వక్షుండు; మడిసె దుర్వారసైన్యములు. నింక నా వానరు నింద్రాదిసురలు శంకింప కనిమొన సాధింపలేరు. ప్రలయాంతకునినైనఁబట్టి నిర్జింపఁ జలమెక్కి యసమానసత్త్వుఁడైనాఁడు. అమరారులను మ్రింగనగచరరూప మమరఁదాల్చినమృత్యువగు నిజం బరయ.” నావుడు వెఱఁగంది నాకారి వగల భావించి యక్షునిఁబలవింపఁదొడఁగె: “హా! కుమారక! యక్ష! హా వీరవర్య! హా! కపిచే నీవు నణఁగితే!’యనుచుఁ. దలఁకుచుఁబలవించుతండ్రినిఁ జూచి తొలఁగక యింద్రజిత్తుఁడు చేరి పలికె:[వా.రా. సర్గ 47] |