| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
భూభారబోగంబు భోగించు నాతఁ డాభీలగతిఁ బొందు నధమలోకముల నీయర్థమునఁ దొల్లి యితిహాసమొకటి పోయిన యది విను భూపాలతనయ సత్యసంధుఁడు నగ్రజన్మప్రియుండు నిత్యకీర్తియునైన నృగుఁడనురాజు పుష్కరక్షేత్రంబుఁ బొంది సత్కర్మ పుష్కరంబను నొక్క పుణ్యకాలమున నెలమిఁ గ్రేపులతోడ హేమశృంగాదు లలవడ రచియించి యగ్రజన్ములకు నొకకోటిగోవుల నుల్లంబు లలర నకలంకగతి దాన మమరంగ నిచ్చె ననఘ తపోమూర్తియగు నగ్నివైశ్యుఁ డను విప్రపుంగవు నావు ముందప్పి ఘనమైన యారాజు కదుపులోఁ గలసి యునికిఁ దానతఁడిచ్చె నొక్కవిప్రునకు నందంద పెక్కేఁడు లరసి యాగోవు నెందుఁగానక యమ్మహీసురోత్తముఁడు కనఖలంబను పేరుగల దేశమునకుఁ జని యట నొకవిప్రు సదనంబునందుఁ దన గోవుఁ గని సమ్మదంబున “శబళ!” చనుదెమ్మనుచు నిజస్వరముఁ జూపుటయు నెలుఁగున నొడయుఁగాఁ నెఱిఁగి మోమెత్తి పిలిచిన యావిప్రు పిఱుఁద నట్లరుగఁ దన్ను నానృపుచేతఁ దగఁ బరిగ్రహము గొన్న బ్రాహ్మణుఁడునుగూడ నేతెంచి దానము నృగుచేతఁ నేను గొన్నాఁడఁ గాన నా గోవిది గాదు నీసొమ్ము నావుడు నొకనవ్వునవ్వి యావిప్రుఁ డేవిధంబున నీకు నిదియేల దక్కు నీకునిచ్చినయట్టి నృగుఁడు దానుండ నీకు నాకును నేల నెరిగాని వాదు నృగు కెఱింగింత మానృగు మాట మనకు నగునంచు నొడఁబడి యావిప్రు లరిగి నగరివాకిటఁ బెక్కునాళ్ళును నిలిచి జగడమాడుచు నవసరములేకున్న వేసరి కనలి యావిప్రు లారాజు నూసరవెల్లియై యొక బొక్కఁ జొచ్చి యొగి పదునెనిమిది యుగముల దనుక తెగకుండునందాఁక దృష్టింపఁబడక యాగొంది నుండుగాకని శాపమిచ్చి యాగోవువిడిచి వారటువోవుచుండి వసుదేవు కడుపున వసుధ నావిష్ణుఁ డసమానగతిఁ గృష్ణుఁ డనఁగ జన్మించు నటమీఁద నీశాప మవ్వాసుదేవు పటుదయాదృష్టిచేఁ బాయుఁగాకనుచు మరలి వారాత్మీయమందిరంబులకు నరిగిరి నావిని యారాజసుతుఁడు జననాథ విప్రులు శపియించి చనిన వెనుక వర్తించిన విధ మెట్టిదనిన విను సుమిత్రాపుత్ర విప్రశాపంబు విని భీతి నారాజు విహ్వలుండగుచుఁ దనకు నయ్యెడు కష్టదశ విచారించి తన మంత్రులాదిగా తగువారినెల్లఁ దడయక రావించి తన పుత్రు వసువుఁ గడువేగఁ బట్టంబు గట్టుండు ధరకు చలికి నెండకు వానజడికి నెచ్చోటు వలనుగా దచ్చోటు వలనొప్పఁ జేసి యక్కడనక్కడ నధికయత్నముల బొక్కలు సేయుఁ డాబొక్కలలోనఁ జరియింతు విప్రులు శపియించినట్లు పొరి నాకుఁ గుడువక పోవ దాఫలము సాగి బొక్కలఁ గప్పి చరియింప నాకుఁ దీఁగెలు వృక్షముల్ తిరిగి రానిడుఁడు చల్లఁగాఁ దావులు జల్లు క్రొవ్విరులు చల్లుఁడు బొక్కలు సవరగాఁ జేసి యారసి రెండు మూఁడామడమేర మీఁదట నెవ్వరి మెలఁగనీకుండ కడువేగ నిప్పని గావింపవలయుఁ దడయరాదని పల్కి తనపుత్రుఁ జూచి జనుల విన్నపములు సతతంబు వినుము తనయ నీతిస్థితి ధరణి పాలింపు తన కర్మఫలమెందుఁ దప్పదు గాన మనమున నాకుఁగా మరుగంగవలదు బుద్ధిమంతుండవై పుత్ర నీవుండు మిద్ధకులాచార మేమరకెపుడు వాత్సల్యమున సాధువర్గంబు నరయు వత్స నీవని పల్కి వసువు బోధించి వాసవతేజుఁడా వసుమతీనాథుఁ డూసరివెల్లియై యొకబొక్కఁ జొచ్చి పరికింప నేఁడు నాపాపశేషమున .......... నృగుపాటుఁ జెప్పితి నీకు నింకొక్క తగుకథ చెప్పెదఁ దమ్ముఁడ వినుము |