| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
రమణీయగతి నేడు రాత్రులు బుచ్చి యమునాతటంబునఁ కఱిగి యచ్చోట ననవుడు భార్గవుండాదిగాఁ గలుగు మునుల యాశ్రమభూమి ముదమార విడిసి వారిచే ధర్మార్థవర్తనులైన వారి వృత్తాంతముల్ వరుసతో వినుచు నవిరళప్రీతిమై నారాత్రి పుచ్చి చ్యవను నీక్షించి యాశత్రుఘ్నుఁడనియె ననఘాత్మ లవణుని యావిక్రమంబు కనలు నాతని చేతి కడిఁదిశూలంబు చందంబులెట్టివి సమరోర్వి నాతఁ డెందఱ సమయించె నెఱిగింపుమనిన వసుధీశనందన వాని లావెందు నసమాన మాశూల మనివార్య మరయ నతనిశూలముచేత నాజిరంగమున మృతులైనవారికి మితి మేరగలదె యైన నేర్పడ విను మవనీశపుత్ర యేను చెప్పెద నీకు యితిహాసమొకటి |