| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
జన్న మగస్త్యుండు సకలధర్మములు నున్నతంబుగ జేయుచున్నాఁడు నియతి నిదియ పండ్రెండవ యేడు దానగుట నుదకాధివాసుఁడై యున్నాఁడు ఘనుఁడు నేడు పూర్ణాహుతి నీవు మాతోడ పోడిగా జనుదెమ్ము పోదము చూడ ననవుడు నగు గాక యని పల్కి రాముఁ డనురాగమున బుష్పకారూఢుఁడగుచు జని చని బహునదీశైలదుర్గముల ఘన ఝిల్లికారవకర్ణకర్కశము భూరిభూరుహ కుంజపుంజభీకరము ఘోరమృగవ్యాళకులసంకులంబు నగు మహారణ్యము నందొక్కచోట నొగి నొక్కగృధ్రంబు నొకయులూకంబు తమతమ యిల్లంచు తమలోన కడగి పెనుకువ వర్తించి పెద్దకాలంబు |