| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
పలలభక్షులు రక్త పానులునగుచు బలము ముందట వెన్క పార్శ్వభాగముల యాతుధానులు చుట్టు నలమి భూతములు ప్రేతజాతంబులు పృథుపిశాచములు పటు చెంచుపుటముల పక్షిజాతముల చటుల సింహవ్యాఘ్రజంబుకంబులును నాసురగతితోడ నరుగుదేరంగ మాసంబుపై నర్ధమాసంబు చనఁగ |