పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - తృతీయస్కంధము
ఉపోద్ఘాతము
క. శ్రీమహిత వినుతదివిజ, స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థేమ! వినిర్జితభార్గవ, రామ! దశానన విరామ! రఘుకులరామా!
1
వ. మహనీయగుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 2
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )